[ad_1]
వయసు పెరిగాక బీపి..
నిజానికి వయసు పెరిగాక కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో అధిక బరువు దగ్గర్నుంచి, అనేక సమస్యలు ఉన్నాయి. వీటితోపాటు బీపి కూడా అయితే, కేవలం ఓ వయసు దాటాక మాత్రమే బీపి వస్తుందనడంలో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు. వారి ప్రకారం చిన్న వయసులోని బీపి వస్తుందని తెలుస్తోంది. ఇలా రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read : Dry Fruits : వీటిని నానబెట్టి తింటే క్యాన్సర్స్ ప్రమాదం తగ్గుతుందట..
ఏ వయసు నుంచి వస్తుందంటే..
డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈమె గురుగ్రామ్‌లో న్యూరాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. ఈమె చెప్పిన దాని ప్రకారం 22, 23 ఏళ్ళ వయసు ఉన్నవారికి కూడా కొన్నిసార్లు హైబీపి వస్తుంది. ఈ సమస్యని యంగ్ ఏజ్ హైపర్ టెన్షన్, యంగ్ ఆన్‌సెట్ హైపర్ టెన్షన్ అంటారు. ఇలా చిన్న వయసులోనే బీపి రావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
Also Read : Irresponsible wife : నా భార్య జీతం మొత్తం షాపింగ్ చేస్తోంది.. అడిగితే..
డాక్టర్ ట్వీట్ కోసం ఇక్కడ చూడండి..
40 ఏళ్ళలోనూ..
కేవలం ముందు చెప్పిన వయసు వారు మాత్రమే కాదు.. 40 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్నవారికి కూడా హైబీపి ఉంటుంది. అయితే, బీపి రావడానికి అందరికీ ఒకే కారణాలు ఉండవు. వయసుని బట్టి కారణాలు కూడా మారతాయని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న వయసులో బీపి రావడం దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల అది ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు.
కారణాలు ఏంటంటే..
యంగ్ ఆన్‌సెట్ హైపర్ టెన్షన్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే హైపర్ థైరాయిడిజం, కిడ్నీ సమస్యలతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉంటాయని డాక్టర్ ప్రియాంక చెబుతున్నారు. యువత, వృద్ధులు.. వీరికి బీపి రావడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయని సెహ్రావత్ అంటున్నారు. యూత్‌లో హైపర్ థైరాయిడిజంలో T3, T4 స్థాయిలు ఎక్కువగా పెరగడం వంటి కారణాలతో వస్తాయి.
కొన్ని అధ్యయనాల్లో తక్కువ వయసు ఉన్నవారిలో బీపి ఉండడం చాలా కామన్. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 8 మందిలో హైబీపి ఒకరిని ప్రభావితం చేస్తుంది. హైబీపి చిన్న వయసులో వచ్చినప్పుడు అనేక సమస్యల్ని తీసుకొస్తుంది. గుండె, మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అధ్యయనం చెబుతోంది.
సమస్య పెరగకుండా..
సాధారణంగా ఏ సమస్య గురించైనా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అది ముదురుతుంది. ఈ కారణంగానే హైపర్ టెన్షన్ గురించి ఎప్పటికప్పుడు టెస్ట్ చేయించుకుని డాక్టర్ సలహాలు పాటించాలి. లేకపోతే ఆ సమస్య మరింతగా ముదురుతుంది. ఈ స్టేజ్ వస్తే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Also Read : Eyestrain : కళ్ళు మంటగా అనిపిస్తున్నాయా.. ఇలా చేయండి…
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
ఉప్పువాడకాన్ని ముందు నుంచి తగ్గించాలి. సరైన ఆహారం, వర్కౌట్, ఒత్తిడి లేని జీవనం కొనసాగించాలి. ఎంతగా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటే అంతగా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవారవుతారు. కాబట్టి ముందు నుంచి కచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సమస్య ముదిరి గుండె సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link