రోజురోజుకి పక్షవాతం సమస్య పెరుగుతోంది. బాధాకరమైన విషయం ఏంటంటే 45 ఏళ్ళలో 24 శాతం మందికి ఈ సమస్య ఎక్కువగా వస్తోంది. వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి హాస్పిటల్‌కి వెళ్తే కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పక్షవాతానికి గురైన వారు శాశ్వతంగా అంగవైకల్యం బారినపడుతున్నారు.

​కారణాలు..

బీపీ, షుగర్ ఉన్నవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో 60 ఏళ్ళు పైడిన వారికి ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. మన దేశంలోని పక్షవాతం వచ్చిన వారిలో 24 శాతం వారే ఉన్నారు. ఆరోగ్యం విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం సమస్య రావడానికి ముఖ్య కారణం. ముందుగా చెప్పిన ఆరోగ్య సమస్యలతో పాటు రక్తంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నవారు, ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే పక్షవాతం వస్తుంది.

​లక్షణాలు..

 • పక్షవాతం లక్షణాల గురించి అందరికీ అవగాహన ఉండడం చాలా ముఖ్యం.
 • ఓ భాగం మొత్తం మొద్దుబారినట్లు ఉండడం
 • ముఖ కండరాలు పక్కకు లాగినట్లు ఉండడం
 • శరీర భాగంలో తిమ్మిరి, స్పర్శలో తేడా
 • ఒక్కసారిగా కంటిచూపు తగ్గడం
 • వణుకుడు వంటి లక్షణాలు

ఈ లక్షణాల్లో ఏవి ఉన్నా వెంటనే ఆస్పత్రికి వెళ్ళాలి. లక్షణాలు కనిపించినా నాలుగున్నర గంటల్లో ట్రీట్‌మెంట్ అందితే అంగవైకల్యం రాకుండా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Also Read : Skipping : ఈ ఒక్క వర్కౌట్‌ చేస్తే బరువు తగ్గడంతో పాటు ఊపిరితిత్తులకి మంచిదట..

​ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

 • షుగర్ ఉన్నవారిలో బీపి ఉంటే రెగ్యులర్‌గా చెక్ చేయించుకోవాలి.
 • బీపి పెరగకుండా జాగ్రత్త పడాలి
 • కచ్చితంగా రోజూ వర్కౌట్ చేయాలి
 • ఆల్కహాల్, పొగతాగడం ఎప్పుడైనా అయితే పర్లేదు. రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది కాదు. పూర్తిగా తగ్గిస్తే మరీ మంచిది.

Also Read : Cough : ఈ ఇంటి చిట్కాలతో దగ్గు త్వరగా తగ్గుతుంది..

​జాబ్ చేసేవారు..

 • కంప్యూట్ జాబ్ చేసేవారు, ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
 • ఒకే పొజిషన్‌లో అరగంటకు మించి కూర్చోకూడదు.
 • ప్రతి అరగంటకు ఓ సారి కొద్దిగా కదలాలి.
 • వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
 • తలవెనుక నొప్పి ఉంటే వెన్నెముకపై భారం పడుతున్నట్లుగా అర్థం
 • కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా యోగా వంటి సాగదీసేటువంటి ఎక్సర్‌సైజ్ చేయాలి.

​ట్రీట్‌మెంట్..

 • పక్షపాతం వచ్చినవారికి త్వరగా ట్రీట్‌మెంట్ అందించాలి
 • బాడీ కదలకుండా ఉన్నప్పుడు వారికి పుండ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
 • ఎందుకంటే ఈ కారణం వల్లే సమస్య ముదిరి ప్రాణాలు కోల్పోతున్నారు.

-Dr.Murali Krishna, Sr.Consultant Neurologist, CARE Hospitals Malakpet

Also Read : Liver Problems : లివర్ ప్రాబ్లమ్స్‌కి ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందంటే..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *