Friday, July 30, 2021

బెంగాల్‌లో పరివర్తన్ రథయాత్రను ప్రారంభించిన జేపీ నడ్డా… టార్గెట్ మమతా…


National

oi-Srinivas Mittapalli

|

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం(ఫిబ్రవరి 6) పశ్చిమ బెంగాల్‌లో ‘పరివర్తన్‌ రథ యాత్ర’ను ప్రారంభించారు. నదియా జిల్లాలోని నబాద్విప్‌ పట్టణంలో పార్టీ జెండాను ఊపి ‘పరివర్తన్ యాత్ర’కు శ్రీకారం చుట్టారు. యాత్రలో భాగంగా పలుచోట్ల ఏర్పాటు చేసిన రోడ్ షోలలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు.

తల్లి, నేల, ప్రజలపై ప్రమాణం చేసి మరీ మమతా బెనర్జీ పదేళ్ల కింద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని జేపీ నడ్డా గుర్తు చేశారు. అయితే ఈ పదేళ్ల కాలంలో ఆమె తల్లిని కొల్లగొట్టారని, నేలను అగౌరవపరిచారని, ప్రజలకు రక్షణ లేకుండా చేశారని విమర్శించారు. బీజేపీ ‘పరివర్తన్ యాత్ర’ ప్రభుత్వ మార్పు కోసం మాత్రమే కాదని, బెంగాల్‌ ప్రజల ఆలోచనలో మార్పు కోసం కూడా అని చెప్పారు. యాత్ర ద్వారా బెంగాల్ ప్రజలను మేల్కొల్పుతామని చెప్పారు. బెంగాల్‌లో అభివృద్ది పేరుతో టీఎంసీ నేతలే దోచుకుతిన్నారని ఆరోపించారు.

‘ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్‌కు అన్నీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ మమత ‘చాహి నా, చాహి నా, చాహి నా'(అవసరం లేదు) అంటూ ప్రతిదానికి అడ్డుపడ్డారు.మమత వద్దన్నవన్నీ రాబోయే మే నెల తర్వాత జరుగుతాయి. బెంగా‌ల్‌ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. అందుకే బీజేపీ కార్యక్రమాల్లో భారీగా పాల్గొంటున్నారు.’ అని జేపీ నడ్డా పేర్కొన్నారు.

మమతా బెనర్జీ అహం కారణంగా బెంగాల్ రైతులు కేంద్ర పథకాల ప్రయోజనాలను పొందలేకపోయారని అన్నారు. గత రెండేళ్లుగా బెంగాల్ లోని 70 లక్షల మంది రైతులకు ఏటా కేంద్రం నుంచి అందాల్సిన రూ.6 వేలు సాయం అందలేదని… మమతా అహంకారపూరిత ధోరణే ఇందుకు కారణమని విమర్శించారు.

పరివర్తన్ యాత్రకు మమతా బెనర్జీ నో చెప్పినా.. ప్రజలు తమకు అనుమతినిచ్చారని నడ్డా అన్నారు. కాగా,బెంగాల్‌లో బీజేపీ రథయాత్ర చేపడితే మత విద్వేషాలు,అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. త్వరలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎంసీకి,బీజేపీకి మధ్య అక్కడ పెద్ద యుద్దమే నడుస్తోంది.



Source link

MORE Articles

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్

సీఎం కొడుకుగా.. బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం...

AMD announces the Radeon RX 6600 XT, a $379 “1080p beast” that arrives on August 11

What just happened? After months of rumors, leaks, and speculation, AMD...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe