పశ్చిమబెంగాల్ మంత్రిపై బాంబు దాడి జరిగింది. ముర్షిదాబాద్ జిల్లా నిమిత్తి రైల్వేస్టేషన్ వద్ద దుండగులు నాటుబాంబుతో దాడి చేశారు. దాడిలో కార్మికశాఖ మంత్రి జాకీర్ హుస్సేన్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే జంగీపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
బాంబు దాడిలో మంత్రితోపాటు మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. రైలులో కోల్ కతా వెళ్లడానికి బుధవారం రాత్రి 10 గంటలకు నిమిత్తా రైల్వేస్టేషన్ వచ్చారు. రైలు కోసం వేచి చూస్తుండగా దాడి జరిగింది. దుండగులు ఒక్కసారిగా బాంబు విసిరారని స్థానికులు తెలిపారు. బాంబు దాడి ఘటనతో పోలీసుల అక్కడికి చేరేకున్నారు. దుండగులను కనిపెట్టే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. మరికొద్దిరోజుల్లో బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది.