తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు చేస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి మరి ఇలాంటి సందర్భంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda Sai Srinivas ) నటిస్తున్న సినిమాలన్నీ కూడా తనకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను అయితే తీసుకొస్తున్నాయి.ప్రస్తుతం ఆయన ‘కిష్కిందపురి’( Kishkindhapuri ) అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా హార్రర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది.మరి గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు.

టీజర్ అద్భుతంగా ఉండటమే కాకుండా ప్రేక్షకులను మెప్పించే రీతిలో ముందుకు సాగుతుందనే చెప్పాలి.ఇక చాలా సంవత్సరాల నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి సరైన సక్సెస్ అయితే రావడం లేదు.ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక ఇప్పటికే ఆయన భైరవం అనే ఒక సినిమా కూడా చేశాడు.
ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలతో స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపు ను సంపాదించుకోవాలనే ప్రయత్నంలో బెల్లంకొండ శ్రీనివాస్ అయితే తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.కానీ ఎప్పటికప్పుడు అవి డిలే అవుతున్నాయి తప్ప భారీ సక్సెస్ అనేదే సాధించలేకపోతున్నాడు.
కారణం ఏదైనా కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…
.
