[ad_1]
బొల్లి అంటే ఏంటి..
బొల్లి అనేది ప్యాచెస్లో రంగుపై వస్తుంది. మనం ఉన్న రంగు కాకుండా తెలుపు రంగులో ప్యాచెస్ శరీరంపై ఏర్పడతాయి. కాలం మారే కొద్దీ ఇవి పెద్దవిగా కూడా అవుతాయి. శరీరంలో ఎక్కడైనా ఈ సమస్య వస్తుంది. ఇది వచ్చినప్పుడు చర్మం అంతా ఒక రంగులో ఉండి అక్కడక్కడ తెల్ల ప్యాచెస్ ఉంటాయి. దీంతో బయటికి వెళ్ళడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. బయటికి వెళ్ళలేరు.
Also Read : Possessive wife : నా భార్య అనుమానిస్తోంది.. విడాకులు తీసుకోవాలనుకుంటున్నా..
బొల్లి రావడానికి కారణాలు..
- సాధారణంగా జుట్టు, చర్మ రంగు మెలనిన్ ఆధారంగా ఉంటుంది. అయితే, ఈ మెలనిన్ని ఉత్పత్తి చేసే కణాలు చనిపోయినప్పుడు బొల్లి వస్తుంది. ఇది ఎలాంటి చర్మం ఉన్నవారికైనా వస్తుంది. కానీ, రంగు కాస్త తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ప్రమాదమేమీ కాదు.ప్రాణాపాయం కూడా కాదు. కానీ, వచ్చినవారు ఒత్తిడిగా ఫీల్ అవుతారు. బయట కలవలేరు. బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకొస్తుందంటే..ఇమ్యూనిటీ డిసార్డర్ కుటుంబ చరిత్ర.. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వారికి వస్తుంది. ఒత్తిడి కారణంగా కూడా ఈ సమస్య వస్తుందని తేలింది.
లక్షణాలు..
చర్మ రంగు కోల్పోవడం
చేతులు, ముఖం, జననేంద్రియాల చుట్టూ ఎక్కువగా రంగు మారడం
తల, వెంట్రుకలు, కనుబొమ్మలు, గడ్డం మీద జుట్టు తెల్లబడడం
నోరు, ముక్కు లోపలి భాగంలో కణజాలాలలో రంగు మారడం
ఎప్పుడు వస్తుంది..
బొల్లి అనే సమస్య సరిగ్గా ఏ వయసులోనైనా రావొచ్చు. కానీ, సాధారణంగా అయితే 30 ఏళ్ళలోపు వస్తుంది.
Also Read : Aerobic exercise : ఈ వర్కౌట్ చేస్తే శరీరంలో రక్తం బాగా సరఫరా అవుతుందట..
ట్రీట్‌మెంట్..
బొల్లికి ట్రీట్మెంట్ ఉండదు. కానీ, ట్రీట్మెంట్ అనేది రంగు మారే ప్రక్రియను ఆపేయొచ్చు. ఇది చర్మ రంగులో వచ్చే మార్పులను మాత్రం పూర్తిగా దూరం చేస్తుందన్న గ్యారెంటీ లేదు.
మీ స్కిన్, వెంట్రుకల్లో రంగు మారితే వెంటనే డాక్టర్ని కలవడం మంచిది.
Also Read : Kanuma Gaarelu : కనుమ గారెలు క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి..
బొల్లితో వచ్చే సమస్యలు..
బొల్లి ఉన్నప్పుడు వచ్చే సమస్యలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. కంటి సమస్యలు, వినికిడి లోపం వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటివి ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
- Read More : Relationship News and Telugu News
[ad_2]
Source link
Leave a Reply