Monday, November 29, 2021

బ్యాంకు డిపాజిటర్లకు రూ.5లక్షలు బీమా -90రోజుల మారటోరియంలోనూ వర్తింపు -కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే

India

oi-Madhu Kota

|

కరోనా మహమ్మారి వరుస వేవ్‌లు, తరచూ లాక్‌డౌన్ల కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి, ఆర్థిక రంగంలో అతి కీలకమైన బ్యాంకుల పరిస్థితి ఇబ్బందికరంగా మారిన ప్రస్తుత తరుణంలో ఊరట నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు చెందిన ఖాతాదారులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వివరాలివి..

ఎంపీ రఘురామ పరారీకి రంగం సిద్ధం -చంద్రబాబు పక్కా స్కెచ్ -మిగిలేది ఇద్దరే: వైసీపీ సాయిరెడ్డిఎంపీ రఘురామ పరారీకి రంగం సిద్ధం -చంద్రబాబు పక్కా స్కెచ్ -మిగిలేది ఇద్దరే: వైసీపీ సాయిరెడ్డి

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మారటోరియం విధించినా బ్యాంకు ఖాతాదారులకు కూడా డిపాజిట్‌ బీమా వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు డీఐసీజీసీ(డిపాజిట్‌ ఇన్స్యూరెన్స్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌) చట్ట సవరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. అందుకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం మీడియాకు వెల్లడించారు.

Union Cabinet approves DICGC Bill, LLP Act:Depositors Rs 5 lakh Insurance in Moratorium

డీఐసీజీసీ చట్ట సవరణతో డీఐసీజీఐ ద్వారా 98.3 శాతం ఖాతాదారులు లబ్ధి పొందుతారని అన్నారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లో ఖాతాదారులు తమ డిపాజిట్లపై రూ. 5లక్షల వరకు బీమా సౌకర్యం పొందొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) ద్వారా బ్యాంకు మారటోరియం క్రిందకు వచ్చిన 90 రోజుల్లోగా డిపాజిటర్లకు ఈ బీమా లభించనుంది. కస్టమర్లకు సకాలంలో అండగా నిలవడం కోసమే ఈ సవరణ చేసినట్లు మంత్రి తెలిపారు.

జగన్ వేడుకున్నా వినని ప్రధాని మోదీ -మరో లేఖాస్త్రం -ఏపీలో 3వ వేవ్ భయాలు -కరోనాపై సీఎం కీలక ఆదేశాలుజగన్ వేడుకున్నా వినని ప్రధాని మోదీ -మరో లేఖాస్త్రం -ఏపీలో 3వ వేవ్ భయాలు -కరోనాపై సీఎం కీలక ఆదేశాలు

డీఐసీజీసీ ద్వారా అందించే బీమా మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.5లక్షలకు పెంచారు. అయితే ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి, లిక్విడేషన్‌ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీసీ నుంచి బీమా మొత్తాన్ని పొందేందుకు వీలుంటుంది. తాజాగా ఈ డీఐసీజీసీ చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నిధులను వెనక్కి తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంకు నష్టాల్లో ఉండి.. సాధారణ కార్యకలాపాలపై ఆర్‌బీఐ తాత్కాలిక నిషేధం విధించినప్పుడు.. ఖాతాలు స్తంభింపజేసినప్పుడు.. రూ. 5లక్షల వరకు నిధులను బీమా ద్వారా పొందే వీలుంటుంది.

English summary

Finance Minister Nirmala Sitharaman on Wednesday announced that the Union Cabinet cleared the amendment to the Deposit Insurance Credit Guarantee Corporation (DICGC) Bill 2021, which would provide account holders an amount of up to Rs 5 lakh within 90 days of bank failure. The DICGC Bill insures all bank deposits and covers all commercial banks, the minister said adding that even foreign bank branches in India are covered under it.

Story first published: Wednesday, July 28, 2021, 18:52 [IST]


Source link

MORE Articles

AP weather: ఏపీకి తుఫాను ముప్పు, 3న జవాద్, భారీ వర్షాలు, బంగాళాఖాతంలో అలజడి

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష ముప్పు వీడటం లేదు. డిసెంబర్ నెల మొదటి వారంలో బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడనుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్రలో డిసెంబర్ 3 నుంచి 5...

Roborock Cyber Monday deals: Get a robot vacuum on the cheap today only!

A robot vacuum is one of the best investments you can make for your home. A good one can clean up your place...

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe