యూఏఈలో భారీ క్యూలు..

ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా సీఈవో సంచలన ప్రకటన చేశారు. తాము అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలను ఇవ్వటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. అయితే ఇది కొంత వరకు బ్యాంక్ ఖాతాదారులను ఆందోళనకు గురిచేసింది. బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగానే రుణాలను ఇస్తుందని చెప్పినప్పటికీ.. మార్కెట్లో అదానీ కంపెనీల పతనం మాత్రం ప్రజల్లో భయాలను పెంచుతోంది. ఇదే సమయంలో యూఏఈలోని ఒక శాఖను బ్యాంక్ మూసివేయనున్నట్లు తెలియటంతో చాలా మంది నెటిజన్లు ఈ రెండింటికీ ముడిపెడుతున్నారు. పార్లమెంటులో కూడా దీనిపై ప్రతిపక్షాలు ప్రధాని మోదీని ప్రశ్నించటంతో మ్యాటర్ హీట్ బయటి దేశాల దాకా చేరిందనే చెప్పుకోవాలి.

బ్రాంచ్ క్లోజ్ ఎందుకు..?

UAEలోని అల్ ఐన్ శాఖను మార్చి 22 నుంచి మూసివేయనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. బ్రాంచ్ నెట్‌వర్క్‌ను హేతుబద్ధీకరించడానికి గత సంవత్సరం తీసుకున్న వాణిజ్య నిర్ణయంలో భాగంగా ఇది జరుగుతోందని కంపెనీ వెల్లడించింది. ఈ బ్రాంచ్ లోని అన్ని ఖాతాలను అబుదాబిలోని శాఖకు బదిలీ చేయబడుతున్నాయి. అయితే ఈ లోపల తమ ఖాతాలను మూసేయాలనుకునే వారు ఎవరైనా మార్చి 22లోపు సదరు శాఖకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంక్ అల్ ఐన్ బ్రాంచ్ వద్ద క్యూల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్యాంక్ స్పందన..

బ్యాంక్ ఆఫ్ బరోడా గత ఏడాది తీసుకున్న నిర్ణయానికి.. ప్రస్తుతం జరుగుతున్న ఆదానీ వ్యవహారంతో లింకు పెట్టడాన్ని బ్యాంక్ తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని బ్యాంక్ స్పందించింది.

ట్విట్టర్ యూజర్ ఏమన్నారంటే..

కొందరు ట్విట్టర్ ఖాతాదారులు ఈ వ్యవహారంపై తమదైన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వెల్లడించటం వైరల్ గా మారింది. ఖాతాదారులు తమ ఖాతాలను క్లోజ్ చేసేందుకు యుఎఇలోని బ్యాంక్ ఆఫ్ బరోడా అల్ ఎన్ బ్రాంచ్ బయట క్యూ కట్టారని ట్వీట్ చేశాడు. అదానీకి రుణాలను ఇచ్చేందుకు సీఈవో ఆసక్తి చూపినందుకే ఇదంతా జరుగుతోందని, నేరస్తులను పార్లమెంట్‌కు ఎన్నుకోవడం వల్ల జరిగే అసలైన పరిణామాలివే అంటూ అందులో రాశారు. క్యూలలో నిలబడ్డ వారు డబ్బు విత్ డ్రా కోసం వేచి ఉన్నారని.. డబ్బు దాచుకునేందుకు కాదని అతడు అభిప్రాయపడ్డారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *