Thursday, June 17, 2021

బ్యాంక్ ఉద్యోగుల సమ్మె -సోమ, మంగళవారాల్లో లావాదేవీల‌పై తీవ్ర ప్ర‌భావం! -కేంద్రం తీరుకు నిరసనగా

National

oi-Madhu Kota

|

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్ర‌భుత్వ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగాయి. మొత్తం 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండటంతో సోమ‌, మంగ‌ళ‌వారాల్లో బ్యాంకింగ్ సేవ‌లు స్తంభించిపోనున్నాయి.

రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌ను ప్రైవేటీక‌రించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా దేశంలోని ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులంతా ఈ నెల 15, 16 తేదీల్లో స‌మ్మె చేస్తామని ఇదివరకే ప్రకటించారు. ఇప్ప‌టికే ఈ నెల 13న రెండో శ‌నివారం, 14న ఆదివారం బ్యాంకింగ్ సేవ‌లు ఉండ‌వు. ఇక సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ఉద్యోగుల స‌మ్మె వ‌ల్ల వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవ‌లు నిలిచిపోయినట్లవుతాయి.

మోదీ సర్కార్ మరో సంచలనం -హైదరాబాద్ సహా మిగిలిన ఎయిర్ పోర్టులన్నీ పూర్తిగా ప్రైవేటు చేతికి

banking-services-to-be-hit-as-10-lakh-employees-prepare-to-go-on-strike-on-march-15-16

దాదాపు ప‌ది ల‌క్ష‌ల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు స‌మ్మెలో పాల్గొంటుండటంతో వివిధ బ్యాంకుల శాఖ‌ల్లో న‌గ‌దు డిపాజిట్లు, విత్‌డ్రాయ‌ల్స్‌, చెక్‌ల క్లియ‌రెన్స్‌, రుణ ద‌ర‌ఖాస్తుల‌కు ఆమోదం వంటి సేవ‌లు దాదాపు స్తంభించ‌నున్నాయి. అయితే ఆయా బ్యాంకుల ఏటీఎం సేవ‌లు య‌థాత‌థంగా కొన‌సాగ‌నున్నాయని వాటి యాజ‌మాన్యాలు పేర్కొన్నాయి.

కాగా, హెచ్ డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొట‌క్ మ‌హీంద్రా బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ తదితర ప్రైవేట్ బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు య‌ధాత‌థంగా సాగ‌నున్నాయి. కానీ దేశీయ బ్యాంకింగ్ రంగంలో వీటి వాటా మూడోవంతు మాత్ర‌మే. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లోని తొమ్మిది ఉద్యోగ సంఘాల వేదిక ఈ స‌మ్మెకు పిలుపునిచ్చింది. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ ద్వారా రూ.1.75 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం సంపాదించుకోవాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా నిర్దేశించుకున్న దరిమిలా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళనబాటపట్టారు.

2ఏళ్ల తర్వాతా జగన్ ప్రభంజనం -అసాధారణ ఓటింగ్ శాతం -వైసీపీ క్లీన్ స్వీప్ -13 జిల్లాల్లో పూర్తి ఫలితాలివే

10 ల‌క్ష‌ల మంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు స‌మ్మెలో పాల్గొంటార‌ని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేష‌న్ (ఏఐబీఈఏ) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీహెచ్ వెంక‌టాచ‌లం అంచ‌నా వేశారు. ఉద్యోగ సంఘాల స‌మ్మె పిలుపు నేప‌థ్యంలో త‌మ శాఖ‌లు, కార్యాల‌యాల్లో ఈ నెల 15, 16 తేదీల్లో లావాదేవీల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు స‌మాచారం ఇచ్చింది.


Source link

MORE Articles

హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే న్నికల ఫలితాలను సవాల్‌ చేస్తూ...

శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలు

కనిపించని హర్లీ.. అమెరికాలో హర్లీ అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. అయితే అదీ ఈ నెల మొదటి వారం నుంచి కనిపించడం లేదు. దీంతో యజమాని కంగారు పడ్డారు....

इस समस्या से जूझ रहे पुरुष करें कद्दू के बीज का सेवन, मिलेंगे गजब के फायदे!

नई दिल्ली: अगर आप शुगर पेशेंट हैं या फिर शारीरिक कमजोरी से जूझ रहे हैं तो ये खबर आपके काम की है. इस...

43 కిలోల బంగారం స్వాధీనం.. రూ.21 కోట్లు విలువ.. ఇక్కడే

మణిపూర్‌లో భారీగా బంగారం పట్టుబడింది. ఇంఫాల్‌లో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.21 కోట్లు విలువ చేసే గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు. అదీ మొత్తం 43 కిలోలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీకేజీ: తీవ్ర అస్వస్థతో ఒకరు మృతి, ఆస్పత్రిలో మరో ఇద్దరు

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం(రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం)లో గ్యాస్ పైప్ లీకైంది. దీంతో అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. నర్సింహా రెడ్డి అనే...

Woman: బాలుడి ప్రాణం పోయింది, మంత్రగత్తె అని ముస్లీం మహిళను చితకబాదేసి, ఇంట్లో నుంచి లాగి !

మంత్రాలు వేస్తున్న మంత్రగత్తె ? రాజస్థాన్ లోని బుండి జిల్లాలోని భజన్రి అనే గ్రామంలో ఓ ముస్లీం మహిళ నివాసం ఉంటున్నది. ముస్లీం మహిళ మంత్రాలు వేస్తోందని...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe