బ్యాంక్‌ కస్టమర్ల అకౌంట్లలోకి అప్పనంగా రూ.820 కోట్లు, దరిద్రం వదిలిందనుకునే లోపే దిమ్మతిరషాక్‌

Byprakshalana

Nov 17, 2023 , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


UCO Bank Transferred Rs 820 Crores Into Customers Accounts: ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్‌ కస్టమర్లకు భారీ జాక్‌పాట్‌ తగినట్లే తగిలి, మిస్సయ్యింది. యూకో బ్యాంక్‌ ఖాతాదార్ల ఖాతాల్లోకి ఒకేసారి 820 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. డబ్బు డిపాజిట్‌ గురించి కస్టమర్ల మొబైల్‌ నంబర్లకు మెసేజ్‌లు కూడా వెళ్లాయి. ఒకేసారి భారీ మొత్తంలో డబ్బు ఖాతాల్లో క్రెడిట్‌ అయ్యేసరికి కొందరు షాక్‌ అయ్యారు, మరికొందరు ఆనందంతో గంతులేశారు. అయితే, ఆ సంబంరమంతా ఆ తర్వాత ఆవిరైంది.

జరిగిన పొరపాటు గురించి తెలుసుకున్న యూకో బ్యాంక్‌, నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. ఏయే కస్టమర్‌ అకౌంట్లలోకి ఆ డబ్బు వెళ్లిందో కనిపెట్టి, ఆ ఖాతాల్లో లావాదేవీలు జరగకుండా ముందుగా బ్లాక్‌ చేసింది. దీంతోపాటు IMPSను (Immediate Payment Service) కూడా నిలిపేసింది. IMPSలో జరిగిన సాంకేతిక లోపం వల్ల (UCO Bank transferred Rs 820 Crores due to a technical error) డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయిందని బ్యాంక్‌ వివరించింది. 

ఈ నెల 10-13 తేదీల మధ్య ఈ ఇబ్బందులు తలెత్తాయని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు (BSE) గురువారం రోజున యూకో బ్యాంక్‌ సమాచారం ఇచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా ట్రాన్స్‌ఫర్‌ అయిన మొత్తంలో దాదాపు 79 శాతం (దాదాపు రూ.649 కోట్లు) రికవరీ అయినట్లు తెలిపింది. 

పొరపాటున ట్రాన్స్‌ఫర్‌ అయిన రూ.820 కోట్లలో దాదాపు రూ.649 కోట్లను వెనక్కు తీసుకున్న యూకో బ్యాంక్‌, ఇంకా రూ.171 కోట్లను రికవరీ చేయాల్సి ఉంది. మిగిలిన డబ్బు రికవర్‌ అవుతుందా, లేదా అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం, IMPS ద్వారా నగదు బదిలీలను (Money transfers through IMPS) యూకో బ్యాంక్ నిలిపేసింది. దీనివల్ల ఇతర బ్యాంక్‌ అకౌంట్ల నుంచి IMPS ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేసిన డబ్బు UCO బ్యాంక్‌ ఖాతాల్లోకి రావడం లేదు, ఇటు నుంచి అవతలి బ్యాంక్‌ అకౌంట్లలోకి వెళ్లడం లేదు. యూకో బ్యాంక్‌ కస్టమర్లంతా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

IMPS అంటే ఏంటి? (What is IMPS?)
IMPS అనేది రియల్ టైమ్ ఇంటర్‌బ్యాంక్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ (Real Time Interbank Electronic Funds Transfer System). ఇది UPIకి ‍‌(Unified Payments Interface) లింక్ అయి ఉంటుంది. IMPS కింద రోజుకు రూ.5 లక్షల వరకు లావాదేవీలు చేయవచ్చు. ఈ సర్వీస్‌ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బును ఆ క్షణంలో ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. వ్యాపార సంస్థలు, కంపెనీలు ఈ సర్వీసును విస్తృతంగా ఉపయోగిస్తాయి.

యూకో బ్యాంక్‌పై సైబర్ దాడి జరిగిందా?
కొంతమంది బ్యాంకర్లు IMPSలో సమస్యను UCO బ్యాంక్‌పై సైబర్ దాడిగా కూడా పిలుస్తున్నారు. ఇది టెక్నికల్‌ ఎర్రర్‌గా బ్యాంక్‌ చెబుతున్నా, అంతకు మించి స్పష్టత ఇవ్వడం లేదు. బ్యాంక్‌ సిబ్బంది వల్ల ఆ సాంకేతిక సమస్య తలెత్తిందా, బయటి నుంచి వచ్చిందా అన్న విషయాన్ని వెల్లడించడం లేదు. ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు (ED) కూడా బ్యాంక్‌ సమాచారం అందించింది, దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

మరో ఆసక్తికర కథనం: మైండ్‌ బ్లాంక్‌ అయ్యేలా గోల్డ్‌ జంప్‌ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficialSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *