Saturday, May 14, 2022

బ్రిటన్ రాజకుటుంబానికి ప్రిన్స్‌ హ్యారీ దంపతుల గుడ్‌బై-అచ్చు బాహుబలి తరహాలోనే..

బ్రిటన్‌ రాణి కోటలో సంచలనం

ప్రపంచంలో అత్యంత గౌరవ మర్యాదలు పొందే రాజకుటుంబాల్లో ఒకటైన బ్రిటన్ రాణి ఎలిజబెత్ కుటుంబంలో తాజాగా అతిపెద్ద సంచలనం నమోదైంది. గతంలో రాణి ఎలిజబెత్ కుమారుడు ప్రిన్స్‌ ఛార్లెస్ భార్య డయానా అనుమాస్పద మృతికి ఏమాత్రం తీసిపోని రీతిలో తాజాగా మరో హైడ్రామా చోటు చేసుకుంది. వీరిద్దరి కుమారుడు, బ్రిటన్‌ రాజకుటుంబ వారసుడు ప్రిన్స్‌ హ్యారీ దంపతులు బకింగ్ హ్యామ్‌ ప్యాలెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. తొలుత ఏడాది పాటు కోటకు దూరంగా ఉండాలని భావించిన వీరిద్దరూ ఇప్పుడు శాశ్వతంగా దూరం కావాలని తీసుకున్న నిర్ణయం తీవ్ర సంచలనం రేపుతోంది.

 రాజరికానికి ప్రిన్స్‌ హ్యారీ దంపతుల గుడ్‌బై

రాజరికానికి ప్రిన్స్‌ హ్యారీ దంపతుల గుడ్‌బై

బ్రిటన్‌ రాజకుటుంబ వారసుడిగా, డ్యూక్‌ ఆఫ్‌ ససెక్స్‌గా ఉన్న ప్రిన్స్‌ హ్యారీ, డచెస్‌గా ఉన్న ఆయన భార్య మేఘన్ మార్కెల్‌ ఏడాది క్రితమే ఓ నిర్ణయం తీసుకున్నారు. ఏడాది పాటు రాజకుటుంబానికి దూరంగా స్వేచ్ఛగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏడాది తర్వాత కూడా వారు రాజకుటుంబానికి బయటే ఉండాలని నిర్ణయించుకుని తమ నిర్ణయాన్ని బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌కు చెప్పేశారు. దీంతో చేసేది లేక బకింగ్‌ హ్యామ్‌ ప్యాలెస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో రాజకుటుంబ విధుల్లో పాలుపంచుకునేందుకు ప్రిన్స్‌ హ్యారీ దంపతులు సిద్ధంగా లేరని, రాజకుటుంబ మర్యాదలకు దూరంగా ఉండాలని వారు నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. కాబట్టి ప్రత్యామ్నాయంగా వారి విధులను ఇతరులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

 ఉక్కపోత భరించలేక బయటపడ్డారా ?

ఉక్కపోత భరించలేక బయటపడ్డారా ?

బ్రిటన్‌ రాజకుటుంబాన్ని వీడాలని ప్రిన్స్‌ హ్యారీ దంపతులు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు బ్రిటన్‌ సైన్యంలో సైనికుడుగా కూడా పనిచేసిన ప్రిన్స్‌ హ్యారీకి బకింగ్‌ హ్యామ్ ప్యాలెస్ వ్యవహారాల్లో కీలక పాత్ర ఉంది. అంతకు మించిన మర్యాద ఉంది. రాజకుటుంబ వారసుడిగా అక్కడ తాను చెప్పిందే వేదం. అయినా కూడా నానమ్మ, రాణి ఎలిజబెత్‌ నీడన ఉండిపోవడం ఇష్టం లేక రాజకుటుంబాన్ని వీడాలని ప్రిన్స్‌ హ్యారీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. ఆర్ధికంగా, స్వేచ్ఛాయుతంగా బతికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్స్‌ హ్యారీ దంపతులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వీరిద్దరూ అక్కడ రాజకుటుంబ కట్టుబాట్ల మధ్య ఉండేందుకు ఇష్టపడలేదని అర్ధమవుతోంది.

 అచ్చు బాహుబలి సీన్ తరహాలో...

అచ్చు బాహుబలి సీన్ తరహాలో…

బ్లాక్‌ బస్టర్‌ మూవీ బాహుబలిలో ఎక్కడో కుంతల దేశపు రాకుమారిని ప్రేమించి తన మాహిష్మతి రాజ్యానికి తీసుకొచ్చిన యువరాజు అమరేంద్ర బాహుబలిని తల్లి పెంచిన తల్లి, రాజమాత శివగామి తిరస్కరిస్తుంది. సింహాసనం కావాలో, ప్రేమించిన దేవసేన కావాలో తేల్చుకోమంటుంది. రాజ్యాధికారం, రాజమర్యాదలు, సింహాసనం పోతాయని తెలిసినా ఇచ్చిన మాట కోసం దేవసేనను పెళ్లి చేసుకునేందుకే బాహుబలి మొగ్గు చూపుతాడు. చివరికి సింహాసనంతో పాటు అన్నీ కోల్పోయి దేవసేనతో కలిసి బాహుబలి ఒంటరిగా రాజ్యం వదిలి వెళ్లిపోతాడు. ఇప్పుడు బ్రిటన్‌ ప్రిన్స్‌ హ్యారీ కూడా దాదాపు అదే పరిస్దితుల్లో తాను కోరుకున్న విధంగా స్వేచ్ఛగా ఉండలేక భార్యతో కలిసి రాజకుటుంబాన్ని వదిలి సాధారణ జీవితం గడిపేందుకు వెళ్లిపోవడం విశేషం.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe