ప్రముఖ నటి శ్రుతి హాసన్ సినిమాల ద్వారా కన్నా లవ్‌స్టోరీలు, బ్రేకప్స్ తోనే ఎక్కువ పాపులర్ అయింది. కమల్ హాసన్ కూతురిగా సినీ గడప తొక్కిన శ్రుతి హాసన్.. కెరీర్ లో ఆరంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్నా, ఆ తర్వాతి కాలంలో సెలిక్టివ్‌గా కథలను ఎంపిక చేసుకుంటూ స్టార్డమ్ సంపాదించుకుంది. తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే..
లండన్‌కు చెందిన నటుడు మైఖేల్ కోర్సేల్‌తో దాదాపు మూడేళ్లు శ్రుతి హాసన్ ప్రేమాయణం నడిపించింది. 2019లో వీరికి బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత కొంత కాలం డిప్రెషన్ కు గురైన శ్రుతి.. 2021లో డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికాతో డేటింగ్ స్టార్ట్ చేసింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఆల్మోస్ట్ ఖాయమని ఫ్యాన్స్ భావించారు. కానీ వీరి బంధం కూడా పెళ్లి వరకు వెళ్లకుండానే ముగిసిపోయింది. అలాగే సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలతోనూ శ్రుతి హాసన్ లవ్ స్టోరీలు నడిపినట్లు కథనాలు వెలువడ్డాయి.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్‌స్టోరీలు మరియు బ్రేకప్స్ గురించి శ్రుతి హాసన్ బోల్డ్ కామెంట్స్ చేసింది. శ్రుతి హాసన్ మాట్లాడుతూ.. `దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక డేంజరస్ ఎక్స్ లైఫ్ ఉంటుంది. దాన్ని పక్కన పెడితే.. ఇప్పుటివరకు ఎలాంటి పశ్చాత్తాపం లేకుండానే నా బంధాలను ముగించాను. ఎవరికివారు ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్ అని అడుగుతుంటారు. వారికి అది జస్ట్ ఒక నంబర్. కానీ నాకు, నేను కోరుకున్న ప్రేమను పొందడంలో ఫెయిల్ అయ్యాను అనేదానికి గుర్తు. ఆ విషయంలో నేను సిగ్గుపడను, కానీ మనిషిగా కొంచెం బాధ ఉంటుంది` అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తాను చాలా నిజాయితీగానే ఉన్నానని, తన బ్రేకప్స్ అన్ని క్లీన్ గా ఉన్నాయని శ్రుతి హాసన్ తెలిపింది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ఎలాంటి రిగ్రెట్స్ లేవని స్పష్టం చేసింది. ఇక వైఫల్యాల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, వాటిని ఎదుగుదలకు సోపానాలుగా భావిస్తానని పేర్కొంది. కాగా, శ్రుతి హాసన్ అప్‌కమింగ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ రజనీకాంత్ తో `కూలీ`, విజయ్ సేతుపతిలో `ట్రైన్`, దళపతి విజయ్ తో `జన నాయగన్`, ప్రభాస్ తో `సలార్ 2` వంటి చిత్రాలు చేస్తోంది. వీటిల్లో కూలీ, ట్రైన్ చిత్రాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటున్నాయి.
The post బ్రేకప్స్ పై శ్రుతి హాసన్ బోల్డ్ కామంట్స్..! first appeared on namasteandhra.