బ్లాక్ కర్రె గుట్టలపై భారీ ఎన్ కౌంట‌ర్‌..ఆరుగురు మ‌వోయిస్టులు మృతి

Date:

Share post:


– Advertisement –

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కర్రె గుట్టలపై 20 రోజులుగా భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. దీనిలో భాగంగా ఐదు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి 10 వేల మందికి పైగా జవాన్ లు అడవులను జల్లెడ పడుతున్నారు. బుధవారం ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ కర్రె గుట్టల పై భద్రతా బలగాలకు మావోల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురుకాల్పులు కొనసాగుతుందటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎన్ కౌంటర్ ని ఐజీ సుందర్ రాజ్, సీఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ ధ్రువీకరించారు.

– Advertisement –



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

త‌మిళ‌నాడులోని ఓ ఆల‌య వేడుక‌లో జల్లికట్టు

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: తమిళనాడులోని ఓ ఆల‌య సంప్ర‌దాయంలో భాగంగా జ‌ల్లిక‌ట్టు క్రీడా పోటీల‌ను నిర్వ‌హించారు. పుదుక్కోట్టైలోని తిరువరంకులంలో శ్రీ పిడారి అమ్మన్...

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్‌. ర‌వీంద్ర‌) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో...

వారణాసిలో ‘ వీరమల్లు ‘ ఫ్రీ రిలీజ్.. స్పెషల్ గెస్ట్ ఎవరో అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌ను భారీ లెవెల్‌లో ప్లాన్...