Tuesday, May 17, 2022

భారత్‌లో కవాసకి నింజా 300 బిఎస్6 విడుదల – ధర, ఫీచర్లు, వివరాలు

మార్కెట్లో బిఎస్6 కవాసకి నింజా మోటార్‌సైకిల్ ధర రూ.3.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మునుపటి బిఎస్4 మోడల్‌తో పోల్చుకుంటే, తాజాగా వచ్చిన ఈ కొత్త బిఎస్6 కవాసాకి నింజా 300 ధర రూ.20,000 అధికంగా ఉంటుంది. ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే అన్ని కవాసకి డీలర్‌షిప్ కేంద్లాలలో బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.

భారత్‌లో కవాసకి నింజా 300 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 కవాసకి నింజా 300 బిఎస్6 మోడల్‌లో డిజైన్ పరంగా కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. ఈ మోడల్‌ను కొత్త పెయింట్ స్కీమ్‌తో ప్రవేశపెట్టినప్పటికీ దీని ఓవరాల్ డిజైన్ మాత్రం పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇది కెఆర్‌టి (కవాసకి రేసింగ్ టీమ్) లివరీ, లైమ్ గ్రీన్ / ఎబోనీ డ్యూయల్ టోన్ మరియు ఆల్ బ్లాక్ పెయింట్ స్కీమ్ ఆప్షన్లలో లభిస్తుంది.

భారత్‌లో కవాసకి నింజా 300 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కవాసకి ఇండియా, తమ నింజా 300 మోటార్‌సైకిల్‌ను తొలిసారిగా 2018లో దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మోడల్ తయారీలో ఉపయోగించిన వివిధ బాడీ ప్యానెల్లు, బ్రేకులు, టైర్లు మరియు హెడ్‌లైట్లు మొదలైన విడిభాగాలను కంపెనీ భారత విక్రయదారుల నుండే కొనుగోలు చేస్తోంది. ఫలితంగా, ఈ మోడల్‌ను కంపెనీ చాలా అగ్రెసివ్ ధరతో ఆఫర్ చేస్తోంది.

భారత్‌లో కవాసకి నింజా 300 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌లోని ప్రధాన ఫీచర్లలో, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు భాగంలో ట్విన్-పాడ్ హెడ్‌లైట్, ఫెయిరింగ్ ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ బ్లింకర్స్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, స్ప్లిట్-స్టైల్ సీట్స్ మరియు ఎగ్జాస్ట్‌లో క్రోమ్ హీట్‌షీల్డ్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో కవాసకి నింజా 300 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కవాసకి నింజా 300 బిఎస్6 మోడల్‌లోని మెకానికల్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీలోడ్-అడ్జస్టబల్ మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక వైపున వరుసగా 290 మిమీ మరియు 220 మిమీ డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి.

భారత్‌లో కవాసకి నింజా 300 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

కొత్త 2021 కవాసకి నింజా 300 మోడల్‌లో బిఎస్-6 కంప్లైంట్ 296సిసి పారలల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 38.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్‌‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లో కవాసకి నింజా 300 బిఎస్6 విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు

ఈ మోటార్‌సైకిల్‌ను ట్యూబ్లర్ ఛాస్సిస్‌పై నిర్మించారు, ఫలితంగా ఇది మంచి బ్యాలెన్స్‌ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో ముందు మరియు వెనుక వైపున వరుసగా 110/70 మరియు 140/70 ప్రొఫైళ్లతో 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి, వీటిపై ఎమ్ఆర్ఎఫ్ టైర్లను అమర్చారు. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 17-లీటర్లు, సీట్ ఎత్తు 795 మిమీ మరియు బరువు 179 కిలోలుగా ఉంటుంది.
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe