Tuesday, May 17, 2022

మంచినీళ్లు అడిగిన పాపానికి… మైనర్ బాలికపై అత్యాచారం,హత్య.. యూపీలో మరో దారుణం..

అసలేం జరిగింది…

బులంద్‌షహర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్ బాలిక(14) తన తల్లిదండ్రులతో పాటు పొలం పనులకు వెళ్తూ వారికి చేదోడు వాదోడుగా ఉంటోంది. చిన్నతనం నుంచే గొంతు సమస్య కారణంగా ఆమె స్పష్టంగా మాట్లాడలేదు. గత గురువారం(మార్చి 25) ఎప్పటిలాగే తన తల్లి,సోదరితో కలిసి పొలం పనికి వెళ్లింది. ఎండలో చాలాసేపు పనిచేశాక ఆమెకు తీవ్ర దాహమైంది. దగ్గరలో నీళ్లు లేకపోవడంతో ఇక ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా ఇంటికి బయలుదేరిన ఆ బాలిక ఆరు రోజులుగా కనిపించకుండా పోయింది.

ఇలా బయటపడింది...

ఇలా బయటపడింది…

తమ కూతురు ఎక్కడికి వెళ్లిందో… ఏమైందో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోలీసులు రంగంలోకి దిగాక ఈ కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. ఆ కుటుంబానికి చెందిన పొలానికి సమీపంలో హరేంద్ర(22) అనే యువకుడి ఇల్లు ఉంది. పోలీసులకు హరేంద్రపై అనుమానం వచ్చి అతన్ని విచారించాలనుకున్నారు. ఇందుకోసం అతని ఇంటికి వెళ్లగా తలుపుకు తాళం వేసి కనిపించింది. దీంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. అదే ఇంటి ఆవరణలో కాంపౌండ్ గోడను ఆనుకుని ఒక మట్టి కుప్ప కనిపించింది.

సిమ్లాలో పట్టుబడ్డ నిందితుడు

సిమ్లాలో పట్టుబడ్డ నిందితుడు

దగ్గరికి దాన్ని పరిశీలించగా… గుంత తవ్వి మట్టి కప్పినట్లుగా అర్థమైంది. దీంతో పోలీసులు వెంటనే ఆ మట్టిని తొలగించి చూడగా… అందులో బాలిక మృతదేహం బయటపడింది. హరేంద్రనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని నిర్దారించిన పోలీసులు అతని కోసం ముమ్మరంగా గాలించారు. ఎట్టకేలకు బుధవారం(మార్చి 3) అతను పట్టుబడ్డాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం అంగీకరించిన అతను… ఆరోజు అసలేం జరిగిందో పోలీసులకు వివరించాడు.

మంచినీళ్లు అడిగిన పాపానికి....

మంచినీళ్లు అడిగిన పాపానికి….

నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం… పొలం పనులు చేసి అలసిపోయిన ఆ బాలిక దాహం వేయడంతో ఇంటికి బయలుదేరింది. అయితే అక్కడికి హరేంద్ర ఇల్లు దగ్గరగా ఉండటం,తెలిసినవాళ్లు కావడంతో ఆ ఇంటికి వెళ్లి మంచినీళ్లు ఇవ్వాలని అడిగింది. ఇదే అదనుగా హరేంద్ర ఆమెను లోపలికి పిలిచి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో బలంగా గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం ఇంటి ఆవరణలోనే గోడ పక్కన గుంత తవ్వి పూడ్చి పెట్టాడు. ఆపై ఇంటికి తాళం వేసి గ్రామం నుంచి పరారయ్యాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe