మధ్యప్రదేశ్ లో కాలువలో పడిపోయిన బస్సు … కొనసాగుతున్న సహాయక చర్యలు బ
బస్సు కాలువలో పడిపోయిన సమయంలో మొత్తం 60 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు మరియు రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డిఆర్ఎఫ్) బృందం సహాయక చర్యలను నిర్వహిస్తోంది.
ఇప్పటివరకు కాలువ నుంచి ఏడు మృతదేహాలను బయటకు తీసినట్లు సిధి కలెక్టర్ రవీంద్ర చౌదరి తెలిపారు.
పూర్తిగా నీటిలో మునిగిపోయిన బస్సును గుర్తించడానికి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు.
ఇప్పటివరకు ఏడుగురిని సురక్షితంగా బయటకు తీశారు .
బస్సు ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఈ ప్రమాదంపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు .తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సిధి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అంతేకాకుండా ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు . బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జరగాల్సిన వర్చువల్ మీటింగ్ ను సైతం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ప్రమాద సమయంలో కాలువలో నీటి మట్టం బాగా ఎక్కువగా ఉండటంతో బస్సు వేగంగా కొట్టుకు పోయిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

నాలుగు రోజుల క్రితం ఏపీలోనూ అరకులో బస్సు ప్రమాదం , తాజాగా మరో విషాదం
నాలుగు రోజుల క్రితం ఏపీలో విశాఖ అరకు వెళ్తున్న టూరిస్ట్ బస్సు లోయలో పడిపోయి చోటు చేసుకున్న విషాదం మరచిపోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘటనలో భారీగా మృతుల సంఖ్య పెరుగుతుంది. బస్సు ప్రమాద ఘటనతో సిధి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బంధువుల ఆర్త నాదాలతో ఆ ప్రాంతం అంతా మార్మోగిపోతుంది .