మనదేశంలో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే – కొత్త కార్లు కొనాలనుకునేవారు ఆప్షన్లు చూసుకోండి!

[ad_1]

Best Selling Cars in Different Segments in 2023: హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ భారతదేశంలో క్రమంగా బలపడుతోంది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అనేక మార్పులను చవిచూసింది. ఈ వాహనాల విక్రయాల్లో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు (Electric and Hybrid Cars)
2023 రెండో త్రైమాసికంతో పోలిస్తే బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (BEV) అమ్మకాలు మొదటిసారిగా 10 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో 24,028 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. 2023 రెండో త్రైమాసికంలో 26,794 యూనిట్లు అమ్ముడుపోగా, మూడో క్వార్టర్‌కు కాస్త తగ్గాయి. మరోవైపు బలమైన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాల (EV) అమ్మకాలు 20,022 యూనిట్లకు చేరుకున్నాయి. ఇందులో టయోటా ముందంజలో ఉంది. బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్స్, బలమైన హైబ్రిడ్ ఈవీల సంయుక్త విక్రయాలు దాదాపు 4.2 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.

ముందంజలో టియాగో ఈవీ, ఇన్నోవా హైక్రాస్
టాటా టియాగో ఈవీ దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్‌గా నిలిచింది. అయితే టయోటా ఇన్నోవా హైక్రాస్ 2023 మూడో త్రైమాసికంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన బలమైన హైబ్రిడ్ ఈవీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ రెండు మోడల్స్ వాటి సంబంధిత సెగ్మెంట్‌ల్లో అత్యధికంగా అమ్ముడైన కార్లుగా నిలిచాయి. 2023లో మొదటి తొమ్మిది నెలలకు టియాగో ఈవీ తన విభాగంలో 41 శాతం, ఇన్నోవా హైక్రాస్ తన విభాగంలో 44 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. టాటా టియాగో ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో 19.2 కేడబ్ల్యూహెచ్, 24 కేడబ్ల్యూహెచ్ ఆప్షన్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.0 లీటర్ 4 సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజన్‌తో మార్కెట్లోకి వచ్చింది.

పెట్రోల్, డీజిల్ కార్లు
2023లో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ కార్ల విభాగంలో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన మారుతి స్విఫ్ట్ ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయించింది. ఇది ఏడు శాతం మార్కెట్ వాటాను పొందింది. ఇప్పుడు కంపెనీ తదుపరి తరం స్విఫ్ట్‌ను 2024 ప్రారంభంలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ ఉండనుంది. ఈ ఇంజిన్‌తో ఇది భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్య కారుగా అవతరిస్తుంది. 2024 స్విఫ్ట్ ఇటీవల జపాన్‌లో దాని కాన్సెప్ట్ రూపంలో పరిచయం అయింది. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ విభాగంలో మహీంద్రా బొలెరో సెమీ అర్బన్, గ్రామీణ మార్కెట్లలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. డీజిల్ మార్కెట్లో మొత్తం 81,344 యూనిట్ల విక్రయాలతో 16 శాతం వాటాను సాధించింది.

సీఎన్‌జీ కార్లు
అంతేకాకుండా సీఎన్‌జీ కూడా భారతీయ కార్ల కొనుగోలుదారులలో ఇష్టపడే ఇంధన ఎంపికగా మారింది. 2023లో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ అత్యధికంగా అమ్ముడైన సీఎన్‌జీ కారు. 66,406 యూనిట్ల అమ్మకాలతో 17 శాతం మార్కెట్ వాటాను సాధించింది.

Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?

Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *