Saturday, July 24, 2021

మమత బెంగాల్‌ కూతురు అస్త్రం సక్సెస్‌-బీజేపీ విలవిల- నితీశ్‌ అస్త్రాన్ని వాడేసిన వైనం

బెంగాల్లో దీదీ వర్సెస్‌ బీజేపీ

ఒకప్పుడు బెంగాల్‌ను సుదీర్ఘకాలం ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కమ్యూనిస్టులను అభివృద్ధి పేరుతో వినాశకులుగా చిత్రీకరించి గద్దె దింపిన మమతా బెనర్జీ రాజకీయాల్లో ఆరిపోయారని జనం గుర్తించడానికి ఎంతో సమయం పట్టలేదు. కమ్యూనిస్టుల స్ధానంలో అధికారంలోకి వచ్చిన మమత… దాన్ని సుస్ధిరం చేసుకుంటూ ఇప్పటికే రెండుసార్లు సీఎం కాగలిగారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో మాత్రం బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. అయితే ఈ పరిస్ధితిని ముందే ఊహించిన మమత… సిద్ధం చేసుకున్న అస్త్రాలే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

దీదీ నుంచి కూతురిగా మారిపోయిన మమత

దీదీ నుంచి కూతురిగా మారిపోయిన మమత

ఒకప్పుడు బెంగాల్లో దీదీ పేరు ఫేమస్‌. మమత ఎక్కడికెళ్లినా ఆమెను దీదీ(సోదరి)గానే పిలిచేవారు. కానీ ఇప్పుడు బెంగాల్‌ ఎన్నికల్లో దీదీ కాస్తా మేయీ(కూతురు)గా మారిపోయారు. దీనికి కారణం బీజేపీనే. కాషాయ పార్టీని ఎదుర్కొనేందుకు స్వాభిమాన మంత్రాన్ని ప్రయోగించిన మమత.. బెంగాల్‌ కూతురుగా మారితే తప్ప ప్రయోజనం ఉండదని గ్రహించారు. అంతే బెంగాల్‌ కూతురు కావాలా వద్దా అంటూ కొత్త నినాదం అందుకున్నారు. దీంతో సహజంగానే బెంగాలీల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన మమతా బెనర్జీ స్లోగన్ ఇప్పుడు అంతే ఆదరణ చూరగొంటోంది. ఇతరత్రా అజెండాతో మమతను ఇబ్బందిపెట్టాలనుకున్న బీజేపీ సైతం ఇప్పుడు బెంగాల్‌ కూతురు నినాదం చుట్టే తిరుగుతోంది.

బీజేపీని ట్రాప్‌లోకి నెట్టేసిన మమత ప్లాన్‌ ఇదే

బీజేపీని ట్రాప్‌లోకి నెట్టేసిన మమత ప్లాన్‌ ఇదే

బీజేపీ అభివృద్ధి, మత రాజకీయాలు, అరాచకాలు వంటి అంశాలను అజెండాగా చేసుకుని ఈసారి మమతను గద్దె దింపాలని ప్లాన్‌ చేసింది. మమత చుట్టూ ఉన్న వారిని అక్కున చేర్చుకుని వారితో అదే విషయాలు చెప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిసోంది. దీంతో మమత బీజేపీ అజెండాను మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇలాంటి విషయాల్లో దిట్ట అయిన వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సాయం తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం మమత కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్‌.. గతంలో బీహార్‌ ఎన్నికల సందర్భంగా తాను వాడిన లోకల్‌ అస్త్రాన్ని బయటికి తీశారు. అదే ఇప్పుడు బెంగాల్‌ సంగ్రామంలో మమతను పైచేయి సాధించేలా చేసింది. బెంగాల్‌ కూతురు నినాదాన్ని మమత తెరపైకి తీసుకురాగానే బీజేపీ కూడా ట్రాప్‌లో పడింది. మమత బెంగాల్‌ కూతురు కాదు మేనత్త అంటూ తన మేనల్లుడు అభిషేఖ్‌ బెనర్జీ అక్రమాలను గుర్తుకు తెచ్చేలా కౌంటర్లు ఇస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

2015 నాటి నితీశ్ ప్లాన్‌ ప్రయోగించిన మమత

2015 నాటి నితీశ్ ప్లాన్‌ ప్రయోగించిన మమత

2015లో బీజేపీకి వ్యతిరేకంగా ఆర్జేడీ, నితీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని జేడీయూ కలిసి పోటీ చేశాయి. దీంతో బీజేపీ తమ పని సులువైందని భావించింది. బీహార్‌కు గతంలో ఆర్జేడీ రుచిచూపించిన జంగిల్‌ రాజ్‌ కావాలా అని ప్రశ్నించింది. ఆర్జేడీ, జేడీయూ ఆధ్వర్యంలోని జంగిల్‌ రాజ్‌ 2.0 కావాలా అని ప్రజల్ని బీజేపీ ప్రశ్నించింది. సరిగ్గా ఇలాంటి సమయంలో నితీశ్‌ పక్కనే ఉన్న ప్రశాంత్‌ కిషోర్‌ స్ధానికతను తెరపైకి తెచ్చాడు. బీహారీ కావాలా బాహరీ(బయటివాళ్లు) కావాలా అని నితీశ్‌ ప్రశ్నించారు. దీంతో జనం స్ధానికుడైన నితీశ్‌కే ఓటు వేశారు. ఆర్జేడీ, జేడీయూ సంకీర్ణ మహాకూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది. అప్పుడు బీజేపీని అడ్డుకునేందుకు నితీశ్‌కు చెప్పిన పాఠాన్నే ఇవాళ మమతకూ చెప్పిన ప్రశాంత్‌ కిషోర్.. ఆ విషయంలో బీజేపీని మరోసారి ట్రాప్‌లోకి నెట్టాడు.


Source link

MORE Articles

ఎంపీటీసీకి కేసీఆర్ ఫోన్-ఆ కార్యక్రమానికి ఆహ్వానం-ఈటల రాజేందర్ చిన్నోడు,పట్టించుకోవద్దని కామెంట్…

హుజురాబాద్ ఉపఎన్నిక వేళ 'దళిత బంధు' పథకానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ నెల 26న దానిపై తొలి అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి...

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe