Friday, July 30, 2021

మరికొద్ది నిమిషాల్లో విమానం టేకాఫ్ అనగా… షాకింగ్ విషయం చెప్పిన ప్రయాణికుడు…

National

oi-Srinivas Mittapalli

|

మరికొద్ది నిమిషాల్లో ఇక విమానం గాల్లో ఎగురుతుందనగా ఓ ప్రయాణికుడు బాంబు లాంటి వార్త చెప్పాడు. తనకు కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్దారణ అయిందని… ఇప్పుడే సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చిందని చెప్పాడు. దీంతో షాక్ తిన్న విమాన సిబ్బంది వెంటనే అతన్ని కిందకు దించేశారు. ఆ తర్వాత మిగతా ప్రయాణికులను కూడా కిందకు దించి విమానం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం(మార్చి 4) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఆ విమానం పుణే వెళ్లాల్సి ఉంది. అప్పటికే టేకాఫ్‌కి ఇక అంతా సిద్దమైంది.ఇంతలో ఓ ప్రయాణికుడు తనకు కోవిడ్ 19 పాజిటివ్‌‌గా తేలినట్లు చెప్పడంతో అంతా షాక్ తిన్నారు. అయినప్పటికీ విమాన సిబ్బంది ఆ పరిస్థితిని జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఎవరూ భయాందోళన చెందవద్దని ప్రయాణికులకు చెప్పారు.

Just Before Take-off, Passenger Onboard IndiGo Says He’s COVID Positive

పైలట్ వెంటనే విమానాన్ని మళ్లీ పార్కింగ్ బే ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. ఆపై ఆ ప్రయాణికుడిని కిందకు దింపి ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం అతన్ని ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.మిగతా ప్రయాణికులను కూడా కిందకు దించి విమానం మొత్తాన్ని శానిటైజ్ చేశారు. దీంతో విమానం షెడ్యూల్ కన్నా రెండు గంటలు ఆలస్యంగా పుణే బయలుదేరింది.

కాగా,ప్రస్తుతం మహారాష్ట్రలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం(మార్చి 5) ఒక్కరోజే కొత్తగా 10,126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,98,399కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 88,838 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇక ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 312 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు. మొత్తంగా గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 16,838 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,73,761కి చేరింది. గడిచిన 24గంటల్లో మరో 113 మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకూ 1,57,548 మంది కరోనాతో మృతి చెందారు. ఇటీవలే దేశంలో రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటివరకూ 17.14లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.


Source link

MORE Articles

బిగాస్ నుండి రానున్న 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు; ఈసారి మేడ్ ఇన్ ఇండియా..

ఈసారి బిగాస్ పూర్తిగా 100 శాతం భారతదేశంలో తయారు చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గడచిన 2020లో లాంచ్ చేసిన...

diseases caused by obesity: आपको इन गंभीर बीमारियों का शिकार बना सकता है मोटापा, इन 5 तरीकों से वजन करें कंट्रोल

diseases caused by obesity: उल्टा सीधा खानपान और गलत लाइफस्टाइल के चलते कई लोग मोटापे से पीड़ित (suffering from obesity) हैं. हेल्थ एक्सपर्ट...

హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో 800 మంది ఎంపీటీసీలు .. కేసీఆర్ కు ఎంపీటీసీల ఫోరం అల్టిమేటం!!

ఓరుగల్లు వేదికగా పోరు బాట పట్టిన ఎంపీటీసీలు పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా ఎంపీటీసీల ఫోరం నిర్వహించిన సమావేశంలో, ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు...

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

జగన్ బెయిల్ రద్దు తీర్పు.. క్విడ్ ప్రోకో సంబంధిత పలు కేసుల్లో నిదితుడైన వైఎస్ జగన్ తన ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని కేసును ప్రభావితం చేస్తున్నారని, సహ...

ఏపీ బాటలో యూపీ, జగన్ ను అనుసరిస్తున్న యోగి : కళ్ళు తెరిచి చూడు బాబు అంటున్న సాయిరెడ్డి

ఏపీ గ్రామ సచివాలయ వ్యవస్థపై గతంలో టీడీపీ విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. గ్రామ...

బసవరాజు బొమ్మై భావొద్వేగం.. శునకం చనిపోతే అలా.. అప్పటి వీడియో నేడు వైరల్

సీఎం కొడుకుగా.. బొమ్మై.. తండ్రి కూడా ఎస్ఆర్ బొమ్మై కూడా సీఎంగా పనిచేశారు. బసవరాజు బొమ్మై హోం మంత్రి నుంచి చీఫ్ మినిస్టర్‌గా ప్రమోట్ అయ్యారు. హోం...

AMD announces the Radeon RX 6600 XT, a $379 “1080p beast” that arrives on August 11

What just happened? After months of rumors, leaks, and speculation, AMD...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe