PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మలేరియా పేషెంట్స్‌ ఇవి తింటే.. త్వరగా కోలుకుంటారు..!

[ad_1]

​World Malaria Day 2023: ఈ రోజు ప్రపంచ మలేరియా దినం. మలేరియా వ్యాధి కారకాలు, లక్షణాలు, చికిత్స, సమాజం నుంచి ఈ ప్రాణాంతక వ్యాధిని నిర్మూలించడానికి సమర్థవంతమైన చర్యలపై అవగాహన పెంచడానికి ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ‘మలేరియా డే’ ను నిర్వహిస్తారు. వరల్డ్‌ మలేరియా డే 2023 థీమ్ ” టైమ్‌ టూ డెలివర్‌ జీరో మలేరియా: పెట్టుబడి పెట్టండి, ఆవిష్కరించండి, అమలు చేయండి.” మలేరియా అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. కుట్టిన దోమలు ప్లాస్మోడియం పరాన్నజీవిని కలిగి ఉంటే, ఈ దోమ కుట్టినప్పుడు, పారాసైట్స్‌ రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. మలేరియా వస్తే రోగికి జ్వరం అధికంగా ఉంటుంది. ఇవి నాలుగు రకాలు ఉంటాయి. ఇందులో ప్లాస్మోడియం ఫాల్సిపరం, ప్లాస్మోడియం వైవాక్స్ జ్వరాలు మన దేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ రెండూ ప్రమాదకరమైనవే. మలేరియా జ్వరం రెండు మూడు రోజులు ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేస్తే, మలేరియా రోగిని 2 వారాల్లో పూర్తిగా నయం చేయవచ్చు. మలేరియాను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. మలేరియా నుంచి త్వరగా కోలుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

లక్షణాలు..

లక్షణాలు..

మలేరియా కారణంగా అధిక జ్వరం, కడుపు నొప్పి, గొంతు మంట, వాంతులు, అతిసారం తలనొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పి, గ్రంథుల వాపు, మలంలో రక్తం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హైడ్రేటింగ్ జ్యూస్‌లు తాగండి..

హైడ్రేటింగ్ జ్యూస్‌లు తాగండి..

మీకు జ్వరంగా ఉన్నప్పుడు.. మీ శరీరానికి శక్తినిచ్చే పానీయాలు తాగండి. జ్వరం శరీర జీవక్రియ రేటును పెంచుతుంది. తద్వారా కేలరీల అవసరాన్ని పెంచుతుంది. చాలా మంది మలేరియా పేషెంట్స్‌కు ఆకలి ఉండదు. దీంతో ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. మీ శరీరానికి శక్తిని అందించడానికి గ్లాకోజ్‌, చెరకు రసం, ఫ్రూట్‌ జ్యూస్‌, కొబ్బరి నీరు వంటి డ్రింక్స్‌ తీసుకోండి. ఇవి మిమ్మల్ని హైడ్రెటింగ్‌గా కూడా ఉంచుతాయి.

వేసవిలో ఈ 5 ఫుడ్స్‌ తింటే.. కొలెస్ట్రాల్‌ కరుగుతుంది..!

ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోండి..

ప్రొటీన్‌ ఎక్కువగా తీసుకోండి..

మలేరియా కారణంగా పేషెంట్స్‌లో కణజాల నష్టం ఎక్కువగా ఉంటుంది. వాటిని రీప్లేస్‌ చేయడానికి ప్రొటీన్‌ అవసరం పడుతుంది. అధిక కార్బోహైడ్రేట్ ఆహారంతో పాటు సరైన మొత్తంలో ప్రోటీన్ డైట్‌ తీసుకోవాలి. పెరుగు, లస్సీ, మజ్జిగ, చేపలు, చికెన్ (సూప్), గుడ్డు వంటి ఆహారం మీ డైట్‌లో చేర్చుకోండి.

(Image source – pixabay)

విటమిన్‌ రిచ్‌ డైట్‌..

విటమిన్‌ రిచ్‌ డైట్‌..

మలేరియా పేషెంట్స్‌ ఎక్కువగా డీహైడ్రేషన్‌, ఎలక్ట్రోలైట్‌ లాస్‌తో బాధపడుతూ ఉంటారు. డీహైడ్రేషన్‌ను దూరం చేయడానికి జ్యూస్‌, స్ట్యూ, రైస్‌ సూప్‌, పప్పు సూప్‌, కొబ్బరి నీరు తాగండి. క్యారెట్, దుంపలు, బొప్పాయిలు, పండ్లు ముఖ్యంగా సిట్రస్ పండ్లు (పైనాపిల్‌, ద్రాక్ష, బెర్రీలు, నిమ్మ) తినండి. విటమిన్‌ ఏ, అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోండి. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ బి కాంప్లెక్స్‌ ఉండే ఆహారాలు తీసుకోండి.

(Image source – pixabay)

వీటికి దూరంగా ఉండండి..

వీటికి దూరంగా ఉండండి..
  • మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. వేయింటిన ఆహారాలు తినకూడదు. ఇవి మీ జీర్ణక్రియపై ప్రభావం చూపుతాయి. ఇది విరేచనాలకు దారితీస్తుంది.
  • ఫైబర్‌ ఆరోగ్యానికి మంచిదే అయినా.. మలేరియా పేషెంట్స్‌ రికవర్‌ అయ్యే వరకు ఫైబర్‌ రిచ్‌ ఆహారం తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
  • వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్స్, ఆయిల్, స్పైసీ ఫుడ్స్, ఊరగాయలకు దూరంగా ఉండాలి.
  • టీ, కాఫీ, కోకో ఇతర కెఫిన్ పానీయాలు ఎక్కువగా తీసుకోవద్దు.

Also Read:Diabetes control: ఈ మొక్క ఆకులతో.. షుగర్‌కు చెక్‌ పెట్టవచ్చు..!

గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *