[ad_1]
ప్రాణాయామం..
ప్రాణాయామాలు.. శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా రక్షిస్తాయి. ప్రాణాయామం వల్ల రక్త ప్రసరణ పుంజుకుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగవుతుంది. దీంతో.. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అనులోమ విలోమ , భమరి వంటి ప్రాణాయామాలు రోజూ ప్రాక్టిస్ చేస్తే మంచిది.
ఆవిరి పట్టండి..
ఒకవేళ మీ దగ్గరలో జలుబు, కరోనా కేసులు గుర్తిస్తే.. వారానికి రెండు నుంచి మూడు సార్లు ఆవిరి పట్టడం మంచిది. వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. రోజూ హెల్బల్ టీ తాగండి. అల్లం, లవంగం, దాల్చినచెక్క, తేనెను మీ హెల్బల్ టీలో వేసుకుంటే… ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.
పోషకాహారం తీసుకోండి..
మీ ఆహారంలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు డేలా చూసుకోండి. శరీరానికి శక్తిని, పోషకాలు అందించే ఆహారం తీసుకోవడం మంచిది. మీ ఆహారంలో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడండి. తాజా పండ్లు, కూరగాలలో ఈ పోషకాలు మెండుగా ఉంటాయి. మీ డైట్‌లో ఇవి ఎక్కువగా తీసుకోవడం మంచిది. సమతుల్య ఆహారం.. మన శరీరంలో ఒక రకమైన కవచాన్ని సిద్ధం చేస్తుంది.
ప్రశాంతంగా నిద్రపోండి..
మనం ఆరోగ్యంగా ఉండటానికి ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. ప్రశాంతమన నిద్ర మన శరీరంరాన్ని రిపేర్ చేస్తుంది. ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థ, మైండ్‌ను హీల్ చేస్తుంది. ఈ చర్యలు మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్‌గా ఉండటానికి రోజూ కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.
ఈ ఆసనాలు ప్రాక్టిస్ చేయండి..
కొన్ని యోగాసనాలు ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి సహాయపడతాయి. భుజంగాసనం, పర్వతాసనం పశ్చిమోత్తనాసనం వంటి ఆసనాలు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. రోజూ ఉదయం 20 నిమిషాల పాటు నడిస్తే మంచిది. రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply