Saturday, July 24, 2021

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం: ట్రక్కు బోల్తా… 16 మంది కూలీలు మృతి…

National

oi-Srinivas Mittapalli

|

మ‌హారాష్ర్ట‌లో ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. జల్గావ్ జిల్లాలోని యావల్ తాలూకా కింగావ్‌లో ఓ ట్రక్కు బోల్తా కొట్టింది. ఆదివారం అర్ధ‌రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 16 మంది కూలీలు మృతి చెందారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని… క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వేగంగా వెళ్తున్న ట్రక్కు ఒక్కసారిగా అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను అభోడా,కెర్హళ,రావెర్ జిల్లాలకు చెందినవారిగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోనూ ఆదివారం(ఫిబ్రవరి 14) తెల్లవారుజామున ఇదే తరహా ప్రమాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.వెల్దుర్తి మండలం మదార్‌పురం గ్రామ సమీపంలో ఓ మినీ బస్సు బోల్తా కొట్టి… అటుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. డివైడర్‌పై ఎక్కిన బస్సు సుమారు 300 అడుగుల వరకూ పల్టీలు కొడుతూ గాల్లో ఎగిరిపడింది. ఇదే క్రమంలో లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. అతివేగం,డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మినీ బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది.

16 labourers dead after truck overturns in Maharashtras Jalgaon

ప్రమాద ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చెక్కులను తానే స్వయంగా మదనపల్లెకు వెళ్లి బాధిత కుటుంబాలకు అందజేస్తానన్నారు. మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబంలో 12 మంది సహా మరో ఇద్దరు మృతిచెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

కాగా, చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన నజీరా బేగం (65),ఆమె ముగ్గురు కుమారులు షేక్‌ దస్తగిరి, షేక్‌ రఫీ, షేక్‌ జాఫర్‌ అలీ కుటుంబ సభ్యులు, నజిరా బేగం కుమార్తె నౌజియా సహా మొత్తం 16 మంది శనివారం రాత్రి 7.30 గంటలకు ఓ మినీ బస్సులో మదనపల్లె నుంచి అజ్మీర్‌ యాత్రకు బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో బస్సు బెంగళూరు-కర్నూలు జాతీయ రహదారిపై అమకతాడు టోల్ గేటు దాటింది. ఆ తర్వాత కొద్దిసేపటికే వెల్దుర్తి మండలం మదార్‌పురంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో డ్రైవర్ నజీర్ బస్సు నడుపుతున్నాడు. డ్రైవర్ నిద్రమత్తులో డ్రైవింగ్ చేయడం,అతివేగంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్దారించారు.




Source link

MORE Articles

10 Gboard shortcuts that’ll change how you type on Android

If there's one thing we Android-totin' pterodactyls take for granted, it's just how good we've got it when it comes to typing out...

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!! గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను...

‘నయా నిజాం.. కేసీఆర్ చెంప మీద కొట్టే ఎన్నిక ఇది-నన్ను కాదు,నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్’

నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్ : ఈటల 'ఈటల రాజేందర్‌కు కుడి,ఎడమ ఎవరూ ఉండొద్దు... ఆయనకు మనిషులే దొరకద్దు... ప్రాణం ఉండగానే బొందపెట్టాలి అని చూస్తున్నారు. ఇక...

ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి ఆత్మహత్య… ఆమె చనిపోయిన రెండు రోజులకే…

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!! బుధవారం(జులై 22) అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జిజు ఇంట్లో లేని సమయంలో అనన్య ఆత్మహత్య చేసుకుంది. అనన్య...

కేటీఆర్ పుట్టినరోజునూ వదలని వైఎస్ షర్మిల .. ఆ హృదయం ఇవ్వాలని షాకింగ్ ట్వీట్ తో పాటు కానుక కూడా !!

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి పుట్టినరోజు సందర్భంగా ఇది మీకు నేను చిన్న కానుక అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కెసిఆర్...

Arm Reveals Flexible, Non-Silicon PlasticArm Chip

Arm and PragmatIC revealed a new microprocessor, PlasticArm, built with "metal-oxide thin-film transistor technology on a flexible substrate" instead...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe