Tuesday, March 2, 2021

మహారాష్ట్రలో భారీగా నమోదైన కరోనా కేసులు… రెండు కొత్త వేరియంట్స్‌… విదర్భ-పర్భనీ రాకపోకలు నిషేధం…

National

oi-Srinivas Mittapalli

|

మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. మంగళవారం(ఫిబ్రవరి 23) రాష్ట్రంలో 6218 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 51 మంది కరోనాతో మృతి చెందారు. ఈ నెల 10 నుంచి మహారాష్ట్రలో కేసుల సంఖ్య అమాంతం పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరి 10న 6112 కరోనా కేసులు నమోదవగా… ఫిబ్రవరి 19న 6112 కేసులు,ఫిబ్రవరి 20న 6971 కేసులు నమోదయ్యాయి.

తాజాగా విదర్భ పరిధిలోని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరిగింది. దీంతో ఆ జిల్లాలకు ఫిబ్రవరి 28 వరకూ రాకపోకలను నిషేధిస్తున్నట్లు పర్భనీ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తుందన్నారు. పబ్లిక్,ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ రెండింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. పర్బనీ-విదర్భ ఎంట్రీ,ఎగ్జిట్ మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కేవలం అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వర్తిస్తున్నవారికే సడలింపు ఉంటుందని చెప్పారు.

According to an official statement, with 6,218 fresh infections, Maharashtras COVID-19 tally rose to 21,12,312.With 51 new deaths reported on Tuesday, the states fatality count rose to 51,857, the government said.

మంగళవారం నమోదైన కేసులతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 21,12,312కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 51,857కి చేరింది. ఇప్పటివరకూ 20,05,851 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసుల్లో ముంబై నగరంలో 643 కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 3,20,531కి చేరింది. గత రెండు రోజుల్లో వరుసగా 900,760 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 11,449 మంది ముంబైలో కరోనాతో మృతి చెందారు.

గత గురువారం రోజువారీ కరోనా కేసుల సగటు 0.17శాతం ఉండగా తాజాగా అది 0.23శాతానికి పెరగడం గమనార్హం. కేసులు రెట్టింపు అయ్యే వ్యవధి 417 రోజుల నుంచి 305కి పడిపోయింది. తాజాగా బయటపడ్డ కేసుల్లో మహారాష్ట్ర,కేరళల్లో SARS-CoV-2 N440K,E484K అనే రెండు కొత్త వేరియంట్స్‌ను కూడా గుర్తించారు.

కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలోని అమరావతి,అకోలా,బుల్దానా,వషీమ్,యావత్‌మల్ జిల్లాల్లో ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో మహారాష్ట్ర వ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్ విధించవచ్చునన్న ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు.

కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 12 రోజులు ముంబై నగరానికి చాలా కీలకమని ఇక్బాల్ పేర్కొన్నారు. కాబట్టి కోవిడ్ 19 నిబంధనలు పాటించనివారి పట్ల బీఎంసీ కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.


Source link

MORE Articles

बड़े काम की चीज हैं बाजरा और रागी के आटे से बनी रोटियां, मिलते हैं यह 5 जबरदस्त फायदे…

नई दिल्ली: आज की भागदौड़ भरी लाइफ में हर इंसान अपने स्वास्थ्य को लेकर चिंतित है. कोई बढ़ते वजन से परेशान है तो...

Cisco Webex adds real-time translation for more than 100 languages | Engadget

We've all been in conversations where a language barrier can make it hard to communicate. Cisco wants to make that problem a thing...

భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఇప్పటికే భారతదేశంలోని సుజుకి మోటార్‌సైకిల్ డీలర్‌షిప్ కేంద్రాలు ఈ కొత్త సూపర్‌బైక్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2021లో...

Kangana: దెబ్బకు హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్, మేడమ్ మాటలు నేర్చింది !

అన్నదాతల ఆవేదన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై కొంతకాలం నుంచి రైతన్నలు భగ్గుంటున్నారు. తమకు నష్టం కలిగించే ఈ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ...

Red Sprites And Blue Jets: इस देश में अचानक बदला आसमान का रंग, दिखी ये दुर्लभ खगोलीय आकृति

नई दिल्ली: दुनिया में ऐसे नजारे बहुत कम ही देखने को मिलते हैं. आकाश में बादलों के ऊपर अंतरिक्ष की तरफ जाती हुई...

తేయాకు కార్మికురాలిగా .. అసోం ఎన్నికల ప్రచారంలో టీ ఎస్టేట్ లో ప్రియాంకా గాంధీ సందడి

టీ గార్డెన్ లో తేయాకులు కోస్తూ సందడి చేసిన ప్రియాంకా గాంధీ వాద్రా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ని గద్దె దించాలని ప్రియాంక గాంధీ...

పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఇండిగో విమానం… కారణమిదే…

షార్జా నుంచి లక్నోకు వెళ్తున్న ఇండిగో ఎయిర్‌ లైన్‌ విమానం మెడికల్ ఎమర్జెన్సీ రీత్యా పాకిస్తాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో వెంటనే విమానాన్ని కరాచీకి...

Compass, which runs an online marketplace for buying, selling, and renting real estate, files for S-1, reveals loss of $270M in 2020 on revenue...

Matthew Blake / HousingWire: Compass, which runs an online marketplace for buying, selling, and renting real estate, files for S-1, reveals loss of...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe