టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు భార్య.. నమ్రత శిరోద్కర్‌కు ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా, మిస్ ఇండియాగా తిరుగులేని ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు ప్రేక్షకులలో మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. 1972 జనవరి 22న మహారాష్ట్ర రాజధాని ముంబైలో పుట్టినీ ఈ అమ్మడు.. 1972లో సత్రజ్ఞు సిన్హా తెరకెక్కించిన షిరిడి కే సాయిబాబా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. తర్వాత అక్షయ్ కుమార్,సునీల్ శెట్టి హీరోలుగా తెరకెక్కిన పూరబ్ కి లేలా.. పశ్చిమ్ కి చేలా సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఇక నమ్రత సినిమాల్లోకి రాకముందే మోడలింగ్ రంగంలో రాణించింది.
1993లో మిస్ ఇండియా, మిస్ ఏషియా పసిఫిక్ గా సెలెక్ట్ అయింది. ఈ అమ్మడు తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు హిందీ సినిమాలతో ఆకట్టుకుంది. తర్వాత మహేష్ బాబు తో కలిసి వంశీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక నమ్రత సోదరీ శిల్పా శిరోద్కర్ కూడా నటిగా బాలీవుడ్ లో రాణిస్తుంది. అంతేకాదు నమ్రత నానమ్మ మీనాక్షి శిరోద్కర్ కూడా మరాఠీ నటి. 1938లో బ్రహ్మచారి అనే సినిమాలో ఈమె మెరిసింది. అలా.. నానమ్మ వారసత్వంతో శిల్పా, నమ్రత లు హీరోయిన్లుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. ఇక నమ్రత తెలుగులో వంశీ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో అంజి సినిమాలో మెరిసింది.
బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా నటించినా.. తెలుగులో మాత్రం నమ్రత నటించింది రెండే సినిమాలు. ఇక వంశీ సినిమా షూట్ టైంలో మహేష్‌తో ప్రేమలో పడ్డ ఈ అమ్మడు.. 2005లో మహేష్‌తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వివాహం తర్వాత నమ్రత సినిమాలకు చెక్ పెట్టేసింది. వీరికి గౌతమ్ కృష్ణ, సీతారా ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. మహేష్, నమ్రత లాగే గౌతమ్ కృష్ణ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 1.. నేనొక్కడినే సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. ఇక సితారా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాల్లో నటించకున్నా.. ఓ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే ఓ మీడియం రేంజ్ హీరోయిన్‌కు ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది.