Monday, November 29, 2021

మాన్సాస్ ట్రస్ట్ ఈవో, స్టాఫ్ వివాదం: అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు

Andhra Pradesh

oi-Rajashekhar Garrepally

|

విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ అశోక్ గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ట్రస్ట్ ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల జులై 17న విద్యా సంస్థల ఉద్యోగులు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ను కలిశారు.

సిగ్గుపడ్డం లేదా?: 'అశోక్‌ బాబాయ్‌’ అంటూనే.. సంచయిత తీవ్ర విమర్శలు, వైసీపీ ఎంపీ కూడా ఫైర్సిగ్గుపడ్డం లేదా?: ‘అశోక్‌ బాబాయ్‌’ అంటూనే.. సంచయిత తీవ్ర విమర్శలు, వైసీపీ ఎంపీ కూడా ఫైర్

అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈవో, ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించి.. కరోనా నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరేపించారనే ఆరోపణలతో అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

A case filed on mansas trust chairman ashok gajapathi raju for EO and staff issue

ట్రస్ట్ చైర్మన్ అశోక్ తోపాటు కరస్పాండెంట్ సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఉద్యోగులను, సిబ్బందిని రెచ్చగొట్టి ఈవోపై దాడికి ఉసిగొల్పారంటూ ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు తీవ్రస్థాయిలో అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

‘అశోక్‌బాబాయ్‌ గారూ… మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్‌ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. ఆయన రక్షణ కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడ్డం లేదా?’ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు సంచయిత గజపతిరాజు.

‘సిబ్బందిని తప్పుదోవ పట్టించి,వారిని రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్‌ విద్యాసంస్థలను వాడు కోకండి . తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు మాన్సాస్‌ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు.ఆ వారసత్వాన్ని అశోక్ గజపతిరాజు గారు ధ్వంసం చేస్తున్నారు’ అని సోషల్ మీడియా వేదికగా సంచయిత తీవ్ర విమర్శలు చేశారు

విజయనగరంలోని మాన్సాస్ ట్రస్టు కార్యాలయాన్ని గత శనివారం మాన్సాస్ విద్యాసంస్థల సిబ్బంది చుట్టుముట్టి ఈవోను నిలదీసిన సంగతి తెలిసిందే. చెల్లించాల్సిన జీతాలపై హామీ ఇవ్వాలని వారు పట్టుబట్టారు. జీతాలు చెల్లించకుండా తాత్సారం చేయడంపై మండిపడ్డారు.

English summary

A case filed on mansas trust chairman ashok gajapathi raju for EO and staff issue.

Story first published: Thursday, July 22, 2021, 22:26 [IST]


Source link

MORE Articles

భారత మార్కెట్లో అత్యధిక మైలేజీని స్కూటర్లు: జెస్ట్, జూపిటర్, యాక్సెస్, యాక్టివా…

రోడ్లపై స్కూటర్లు మంచి ప్రాక్టికాలిటీని కలిగి ఉండి, గేర్లతో నడిచే మోటార్‌సైకిళ్ల కన్నా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు నడపడానికి సులువుగా ఉంటాయి. సరసమైన ధర, లైట్ వెయిట్,...

కొత్త ప్లాంట్‌ ఏర్పాటుకి శ్రీకారం చుట్టిన Ather Energy.. కారణం అదేనా?

దేశీయ విఫణిలో 450X మరియు 450 ప్లస్ స్కూటర్‌లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీకి రెండవ ప్లాంట్‌గా కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఈ కొత్త ప్లాంట్ తర్వాత కంపెనీ...

Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका, इन चीजों को खाने से मिलेगा गजब का फायदा

Increase stamina Symptoms causes and prevention of stamina deficiency stamina booster food brmp | Increase stamina: पुरुषों का स्टेमिना बढ़ाने का रामबाण तरीका,...

जानलेवा बीमारी के कारण बीच में ही छूट गई थी Johnny Lever के बेटे की पढ़ाई, शरीर में दिखने लगते हैं ऐसे लक्षण

comedian johnny levers son jessey lever was suffered from throat cancer know its symptoms and stages samp | जानलेवा बीमारी के कारण बीच...

The best Cyber Monday deals happening now

Black Friday is technically over, but many of the same deals have carried over into Cyber Monday — plus a few...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe