[ad_1]
Stock Market Closing 05 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లను మళ్లీ ఆర్థిక మాంద్యం భయాలు ముంచెత్తాయి. అంతర్జాతీయ మార్కెట్లు ప్రతికూల సంకేతాలు ఇవ్వడం మదుపర్లలో నెగెటివ్ సెంటిమెంటు నింపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 50 పాయింట్ల నష్టంతో 17,992 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 304 పాయింట్ల నష్టంతో 60,353 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 24 పైసలు బలపడి 82.56 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 60,657 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,847 వద్ద మొదలైంది. 60,049 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,877 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 304 పాయింట్ల నష్టంతో 60,353 వద్ద ముగిసింది.
News Reels
NSE Nifty
బుధవారం 18,042 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 18,101 వద్ద ఓపెనైంది. 17,892 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,120 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 50 పాయింట్ల నష్టంతో 17,992 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీగా నష్టపోయింది. ఉదయం 43,073 వద్ద మొదలైంది. 42,298 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,137 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 350 పాయింట్లు తగ్గి 42,608 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 33 కంపెనీలు లాభాల్లో 17 నష్టపోయాయి. సిప్లా, బజాజ్ ఆటో, ఐటీసీ, హిందుస్థాన్ యునీలివర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫీ, టైటాన్ షేర్లు నష్టపోయాయి. ఫైనాన్స్, ఐటీ, ప్రైవేటు బ్యాంక్ సూచీలు పతనమయ్యాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు గ్రీన్‌లో కళకళలాడాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply