Tuesday, May 24, 2022

మా నాన్నను చంపినోళ్లను క్షమించా -గొంతు నొక్కితే యువత సైలెంటైపోదు -సంక్షోభ పుదుచ్చేరిలో రాహుల్ గాంధీ

సంక్షోభ పుదుచ్చేరిలో పర్యటన..

ఇంకో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా.. కాంగ్రెస్ మంత్రులు ఒక్కొక్కరుగా బీజేపీలోకి జంప్ అయిపోతుండటంతో పుదుచ్చేరి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నారాయణస్వామి కేబినెట్ మంత్రి నమశ్శివాయం, ఎమ్మెల్యే తీప్పైనాథన్ లు ఇటీవల బీజేపీలో చేరగా, ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు స్వచ్ఛంద రాజీనామా, మరో ఎమ్మెల్యే జాన్ కుమార్ రాజీనామాలతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిందని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ సీఎం మాత్రం తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని, పూర్తి మెజారిటీ ఉందని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంలో కేంద్రానికి అనుగుణంగా వ్యవహరించని కారణంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై మోదీ సర్కారు వేటేసింది. ప్రస్తుతం సంక్షోభం నెలకొన్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ బుధవారం పర్యటించారు.

యూత్ పవరే అది..

యూత్ పవరే అది..

ఒకరోజు పర్యటన కోసం పుదుచ్చేరి వచ్చిన రాహుల్ గాంధీ.. స్థానిక భారతిదాసన్ ప్రభుత్వ కాలేజీలో విద్యార్థులతో సమావేశమయ్యారు. రాజీవ్ గాంధీ హంతకుల గురించి ఓ విద్యార్థిని అడిగి ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘వాళ్లను నేను క్షమించాను’అని రాహుల్ బదులిచ్చారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ కేంద్రం జైళ్లలోకి నెట్టేయడాన్ని, ఇటీవల యువ పర్యావరణ కార్యకర్త దిశ రవి అరెస్టు తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావించిన ఆయన.. ప్రభుత్వం తనకున్న బలంతో ఎంత గట్టిగా యువత గొంతు నొక్కాలని చూస్తే, యువతరం అంతే బదులిస్తుందని అన్నారు. ‘‘మీరు దేశాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ, కనీసం మాట్లాడనీయకుండా చేస్తే అది దేశ విధిని నాశనం చేసినట్లేనని గుర్తుంచుకోండి. ఎవరూ నోరు తెరవకుండా ఉండేలా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను యువకులెవరూ అనుమతించొద్దు. రాజ్యాంగ నిబంధనల మేరకు పోరాడాల్సిందే” అని రాహుల్ పేర్కొన్నారు. కాగా,

మత్యకారులు సముద్ర రైతులు..

మత్యకారులు సముద్ర రైతులు..

విద్యార్థులతో భేటీకి ముందు బంగాళాఖాతం తీరంలో మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రైతులకు వ్యతిరేకంగానే సాగు బిల్లులను కేంద్రం తెచ్చిందన్నారు. మత్స్యకారుల సమావేశంలో రైతుల గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగించ వచ్చని, అయితే మత్స్యకారులు కూడా సముద్ర రైతులేనని అన్నారు. ఈ దేశ భూమిపుత్రలకు (రైతులకు) కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఉన్నప్పడు సముద్ర రైతులు (మత్స్యకారులు)కు మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. కేంద్రంలోని ప్రభుత్వం చిన్న, మధ్యతరహా వ్యాపారాలను దెబ్బతీసిందని, బడా కార్పొరేట్ల గుప్పిట్లోనే అన్ని వ్యాపారాలు ఉండాలన్న కారణంతోనే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగిందని రాహుల్ ఆరోపించారు. ఇందుకు భిన్నమైన అభిప్రాయం కాంగ్రెస్‌దని చెప్పారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలను పటిష్టం చేయాలన్నదే పార్టీ అభిమతమని, వారివల్లే దేశానికి బలం చేకూరుతుందని అన్నారు. కాగా,

ఇటాలియన్‌లో కౌంటరిచ్చిన కేంద్రం..

ఇటాలియన్‌లో కౌంటరిచ్చిన కేంద్రం..

మంత్రిత్వ శాఖ ఉన్నప్పడు సముద్ర రైతులు (మత్స్యకారులు)కు మంత్రిత్వ శాఖ ఎందుకు ఉండకూడదంటూ కొత్త డిమాండ్ లేవనెత్తిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కేంద్రం అనూహ్య రీతిలో బదులిచ్చింది. కేంద్ర మత్యశాఖను నిర్వహిస్తోన్న మంత్రి గిరిరాజ్ సింగ్ ఇటాలియన్ భాషలో ట్వీట్ చేశారు. సోనియా పుట్టిన దేశం ఇటలీలో కూడా మత్యకారుల సంక్షేమానికి శాఖ లేదని, వ్యవసాయ శాఖ పరిధిలోకే మత్యకారులు వస్తారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe