మా బంధానికి పేరు పెట్టలేను: స‌మంత‌

Date:

Share post:


ప్ర‌ముఖ న‌టి స‌మంత‌ ప్ర‌స్తుతం యాక్టింగ్ తో పాటు నిర్మాణ‌ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఆమె హోమ్ బ్యాన‌ర్ ట్రాలాల పిక్చ‌ర్స్ సంస్థ నుంచి రాబోతున్న తొలి చిత్రం `శుభం`. మే 9న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. తాజాగా కోలీవుడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స‌మంత `గోల్డెన్ క్వీన్` అవార్డును సొంతం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా స‌మంత త‌న కెరీర్ మ‌రియు వ్య‌క్తిగ‌త బంధాల గురించి మాట్లాడింది.

అభిమానుల‌ మద్దతు తన అదృష్టమని, ఆ అదృష్టానికి త‌న కష్టం తోడ‌వ‌డం వల్లే ఇంత ఆదరణ లభిస్తోందని స‌మంత పేర్కొంది. ఈ క్ర‌మంలోనే ద‌ర్శ‌క‌న‌టుడు రాహుల్ రవీంద్రన్ తో త‌న‌కున్న అనుబంధాన్ని కూడా స‌మంత వివ‌రించింది. `నాకు హెల్త్ బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండ‌గా నిలిచాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండి నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడు. మా బంధానికి ఓ పేరు పెట్టలేను. స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను` అంటూ స‌మంత భావోద్వేగ‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

కెరీర్ గురించి స‌మంత మాట్లాడుతూ.. మనం తీసుకునే ఒక్క నిర్ణయంతో కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. తెలిసి తెలియ‌క మ‌నం తీసుకునే ఎన్నో నిర్ణయాలు మన ప్రయాణంపై ప్రభావం చూపుతాయంటూ చెప్పుకొచ్చింది. కాగా, స‌మంత అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. ఈ స్టార్ బ్యూటీ `మా ఇంటి బంగారం` చిత్రంలో న‌టిస్తోంది. ఈ మూవీకి నిర్మాత కూడా స‌మంత‌నే. అలాగే ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ కోసం సామ్ `రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్డమ్` అనే వెబ్ సిరీస్ చేస్తోంది. చివ‌ర‌గా `సిటాడెల్: హనీ బన్నీ`తో స‌మంత ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం..

చోద్యం చూస్తున్న అధికారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిఉమ్మడి నిజమాబాద్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు తడుస్తున్న ధాన్యంరహదారుల వెంట,కల్లాల్లో...

అస‌లు దెయ్యం అదే.. క‌విత‌కు కేటీఆర్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత...

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అభిమానులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు. ఇక...