మీ పిల్లల బంగారు భవిష్యత్‌ కోసం మంచి పెట్టుబడి మార్గాలివి

[ad_1]

Investment Plans For Child: ఈ రోజుల్లో విద్యా ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. పిల్లలకు పెళ్లి చేయాలన్నా ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇలాంటి వ్యయాల కోసం అప్పటికప్పుడు డబ్బులు వెదుక్కునే బదులు, దీర్ఘకాలం పాటు కొద్దిగా కొద్దిగా కూడగట్టడం చాలా ఉత్తమం. దాని వల్ల మీకు పెద్దగా ఆర్థిక భారం లేకుండానే.. మీ పిల్లల ఉన్నత విద్య లేదా వివాహ సమయానికి పెద్ద మొత్తంలో డబ్బు పోగవుతుంది. డబ్బులను ఇలా పోగు చేయాలంటే ముందుగా విద్యా ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక ద్రవ్యోల్బణం గురించి మీకు అవగాహన ఉండాలి. మీరు ఏ లక్ష్యంతో డబ్బు కూడబెట్టాలి, ఎంత కాలానికి తిరిగి ఆ మొత్తం మీకు అవసరం, ప్రతి వాయిదాలో ఎంత పెట్టుబడి పెట్టాలి వంటివి మీరు కచ్చితంగా గుర్తించగలగాలి.

మీ పిల్లల మంచి భవిష్యత్‌ కోసం పెట్టుబడి పెట్టదగిన మార్గాలివి:

చిన్న మొత్తాల పొదుపు పథకాలు (Small Savings Schemes) 
పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF), నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (NSC), సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి పథకాల్లో పెట్టుబడుల్లో రిస్క్‌ అతి తక్కువగా ఉంటుంది, దీర్ఘకాలం పాటు కొనసాగిస్తే మంచి మొత్తాన్ని అందిస్తాయి. మీ పిల్లల వయసు, పెట్టుబడి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీటిలో ఒక ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. ఆడపిల్లల వివాహం, ఉన్నత విద్య కోసం ఇప్పట్నుంచే పెట్టుబడి పెట్టాలని చూస్తుంటే, సుకన్య సమృద్ధి యోజన మంచి ఆప్షన్‌ అవుతుంది. PPF, NSCతో పాటు పోస్టాఫీసు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోనూ పెట్టుబడి పెట్టొచ్చు.

ఫిక్స్‌డ్‌, రికరింగ్‌ డిపాజిట్లు
మీ పిల్లల భవిష్యత్‌ కోసం పెట్టుబడి పెట్టే మార్గాల్లో బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా ఒక ఉత్తమ మార్గం. పెట్టుబడి మొత్తాన్ని మెచ్యూరిటీ పిరియడ్‌ వరకు కదలించకుండా ఉంటే, పిల్లల వివాహం లేదా విద్య కోసం ఏకమొత్తంగా డబ్బు అందుకోవచ్చు. ప్రస్తుతం అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లు పెంచాయి. కొన్ని సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా కొంత కొంత జమ చేస్తూ వెళ్లాలని మీరు భావిస్తే.. రికరింగ్‌ డిపాజిట్లు కూడా మంచి మార్గం. 

news reels

సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ (SGB)
ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించే అత్యుత్తమ పెట్టుబడి సాధనం బంగారం. బంగారానికి ఈక్వల్‌గా ఉండే సావరిన్‌ బాండ్లను రిజర్వ్‌ బ్యాంక్‌ లాంచ్‌ చేస్తుంది. ఈ బాండ్ల కొనుగోలు ద్వారా మీరు బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ బాండ్లను బ్యాంకుల ద్వారా కొనవచ్చు. కాకపోతే ఇవి భౌతిక బంగారం కాదు, డిజిటల్‌ గోల్డ్‌. తిరిగి అమ్మే సమయంలో, భౌతిక బంగారంలో ఉండే ఇబ్బందులేమీ దీనిలో ఉండవు, సులభంగా అమ్మొచ్చు. సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల మీద ఎంత వడ్డీ చెల్లిస్తారన్న విషయాన్ని కూడా RBI ముందే ప్రకటిస్తుంది. 

మ్యూచువల్‌ ఫండ్స్‌
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ కూడా మీ పిల్లల కోసం పెట్టే పెట్టుబడుల్లో ఒక మార్గం. వీటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు సమీప కాలానికి కాకుండా, దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఈక్విటీ మార్కెట్లలో ఒడిదొడుకులకు లోనవుతుంటాయి కాబట్టి, మ్యూచువల్‌ ఫండ్ల స్వల్పకాలిక రాబడిలోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. అయితే, మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాల పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. వీటిలో ఒకేసారి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. క్రమానుగత పెట్టుబడి ప్రణాళిక (SIP) మార్గంలో ప్రతి నెలా కొంత మొత్తం యాడ్‌ చేస్తూ వెళ్లవచ్చు. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *