మీ బ్రెయిన్‌ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇవి కచ్చితంగా తినాలి..!

[ad_1]

Foods Good For Brain Health: మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో మెదడు ఒకటి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటో పోషకాలు అవసరం. శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగా మనం తినే ఆహారం నుంచి మన మెదడు పోషకాలను గ్రహిస్తుంది. సరైన ఆహారం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఏ పని చేసినా లేదా ఏ విషయం గురించైనా మెదడు చురుగ్గా అలోచించాలన్నా దానికి కూడా ఎంతోకొంత శక్తి అవసరమవుతుంది. పోషకాహారం మెదడును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మన మెదడును యాక్టివ్‌గా ఉంచే.. ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పసుపు..

పసుపులోని ఔషధ గుణాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పసుపు మన ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే.. మెదడు ఆరోగ్యానికీ తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులోని కర్క్యుమిన్‌ అనే సమ్మేళనం ఉంటుంది.. ఇది అల్జిమర్స్‌ ముప్పును తగ్గిస్తుంది, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. రోజూ గోరువచ్చటి పాలలో.. చిటికెడు పసుపు వేసుకుని తాగితే.. మెదడు యాక్టివ్‌గా పనిచేస్తుంది.

బెర్రీస్‌..

స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ, బ్లాక్‌ బెర్రీ, రాస్బెర్రీ లాంటి బెర్రీ జాతికి చెందిన పండ్లలో యాంథోసైనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడులో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బెర్రీ పండ్లను రోజూ తీసుకోవడం వల్ల అన్ని వయసుల వారిలోనూ జ్ఞాపకశక్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

తేనె..

తేనెలో ఉండే.. మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, బి- విటమిన్‌ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తేనెలో ఉండే.. ఫ్రక్టోజ్‌ బ్రెయిన్‌కు ఫ్యూయల్‌లా పనిచేస్తుంది. తేనె మానసిక ఒత్తిడిని తగ్గించి.. బ్రెయిన్‌ను యాక్టివ్‌ చేస్తుంది.

నట్స్..

విటమిన్లు, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్ల‌ు.. నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, హాజెల్ నట్స్ మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఇవి మెదడు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. . తద్వారా అల్జీమర్స్, పార్కిన్‌స‌న్స్‌లాంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఆకుకూరలు..

బ్రకలీ, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ… లాంటి కూరల్లో కె, సి, ఇ-విటమిన్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. వీటిలోని గ్లూకోసినోలేట్స్ అనే సమ్మేళనం శరీరంలోని ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ను తగ్గిస్తుంది. అల్జీమర్స్‌ ఉన్నవారికి ఆకుకూరలు బెస్ట్‌ ఆప్షన్‌

టమాటాలు..

టమాటాలు మన డైట్‌లో తరచుగా తీసుకుంటే.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. టమాటాల్లో ఉండే..ఉండే ‘లైకోపీన్’ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు కణజాలాల్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. టమాటాలు ఎక్కువగా తినే వారికి బ్రెయిన్‌ యాక్టివ్‌గా ఉంటుంది.

బీట్‌రూట్‌..

ఇందులో నైట్రేట్స్, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి. ముఖ్యంగా నైట్రేట్లు మెదడుకు రక్త సరఫరా ప్రక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఫోలిక్ యాసిడ్, విటమిన్ B9, అల్జీమర్స్ వంటి రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుడ్లు..

గుడ్లు పోషకాల స్టోర్‌ హౌస్‌. గుడ్డులో విటమిన్లు A, D, B12, కోలిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కోలిన్ మెదడు అభివృద్ధికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. గుడ్డులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ కూడా అధికంగా ఉంటాయి.

చేపలు..

చేపలలో మెదడు పనితీరుకు అవసరమైన ఒమేగా-3 ప్యాట్స్‌, అయోడిన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. చేప మెదడులోని బూడిద పదార్థాన్ని వేగవంతం చేస్తుంది. చేపలు తినేవారిలో బూడిదరంగు పదార్థం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు నిరూపించాయి. దింతో.. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.(image source – pixabay)

ఇవి తినండి..

మెదడు ఆరోగ్యానికి కోలిన్‌ చాలా అవసరం. ఇది జ్ఞాపకశక్తి, మానసిక స్థితి వంటి వాటికి కీలకమైన అసిటిల్‌కోలిన్‌ అనే నాడీ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మన లివర్‌ కొంతవరకు తయారు చేస్తుంటుంది గానీ మెదడు చేసే అన్ని పనులకు అది సరిపోదు. దీన్ని ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. మీ డైట్లో గుడ్లు, చేపలు, చికెన్‌ తీసుకుంటే.. అసిటిల్‌కోలిన్‌ ఎక్కువగా లభిస్తుంది. పాలు, పెరుగు, ఛీజ్‌, ఉడకబెట్టిన బంగాళాదుంపలు, పుట్టగొడుగులలోనూ.. అసిటిల్‌కోలిన్‌ లభిస్తుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *