[ad_1]
ప్రముఖ పోషకాహార నిపుణురాలు.. కీర్తి రూపానీ.. బరువు తగ్గడానికి కొన్ని హోమ్ రెమిడీస్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేశారు. కిచెన్‌లో ఉపయోగించే కొన్ని ఆహారాలు.. బరువు కంట్రోల్‌లో ఉంచుకోవడానికి సూపర్‌ఫుడ్స్‌లా పనిచేస్తాయని ఆమె వివరించారు. ఇవి బరువు తగ్గించడంతో పాటు.. డయాబెటిస్, గుండె సమస్యల నుంచి రక్షిస్తాయని అన్నారు.
కసూరీ మేతీ..
కసూరి మేతీలో.. ఫైబర్, ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఆహారానికి మంచి రుచి ఇవ్వడమే కాదు.. దానిలోని పోషకాలను పెంచుతుంది. అధిక బరువు, డయాబెటిస్, గుండె సమస్యలతో బాధపడేవారు.. వారి డైట్‌లో కసూరి మేతీని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
దాల్చిన చెక్క..
దాల్చినచెక్కలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది, ఇది బరువు తగ్గించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దాల్చిన చెక్కలో ఉండే క్రోమియం ఆకలిని అదుపులో ఉంచుతుంది. శరీరంలోని గ్లూకోజ్ స్థాయుల్ని న్యూట్రల్ చేసి.. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. దాల్చిన చెక్కలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి.. మనం తీసుకున్న ఆహారంలోని మంచి బ్యాక్టీరియా పొట్టలోకి చేరేందుకు సహాయపడుతాయి. తద్వారా జీర్ణవ్యవస్థ క్లీన్ అయ్యి.. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. బరువు తగ్గలనుకునేవారు.. ప్రతిరోజూ 1/2 టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని 1 గ్లాసు నీటిలో కలిపి తీసుకోవాలని పోషకాహార నిపుణురాలు కీర్తి రూపానీ అన్నారు. ఇది బరువును తగ్గంచడమే కాదు.. డయాబెటిస్, గుండె సమస్యల నుంచి రక్షిస్తుంది.
పసుపు..
పసుపు భారతీయ ఆహారంలో భాగం. ఇందులో ఉండే కర్కుమిన్ కొవ్వు కణజాల పెరుగుదలను నిరోధిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, ఇన్సులిన్ నిరోధకతను నివారిస్తుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. యూరోపియన్ రివ్యూ ఫర్ మెడికల్ అండ్ ఫార్మకోలాజికల్ సైన్స్ పరిశోధన ప్రకారం, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న పసుపు అధిక బరువును కంట్రోల్ లో ఉంచుతుంది.
నిమ్మగడ్డి..
నిమ్మగడ్డి టీ.. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మీ వెయిట్ లాస్ జర్నీకి సహాయపడే ఎఫెక్టివ్ డ్రింక్.
నువ్వులు..
నువ్వులలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి పని చేస్తాయి నువ్వుల్లో లభించే సెసమిన్ చిన్న పేగులో కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటుంది, అలాగే కొలెస్ట్రాల్‌ను తయారుచేయడంలో భాగమైన ఎంజైమ్ పనితీరును కూడా నిరోధిస్తుంది. నువ్వుల్లో ఉండే ఆల్ఫాలినోలిక్ యాసిడ్.. ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి. వీటిలో ఉండే.. సొల్యుబల్ ఫైబర్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రొజూ ఒక స్పూన్ నువ్వులు తింటే.. త్వరగా బరువు తగ్గుతారు.
కరివేపాకు..
కరివేపాకు మన చర్మం, జుట్టు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ బి2, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ కరివేపాకు నమిలినా, మన డైట్‌లో చేర్చుకున్నా.. క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. ఇది ఊబకాయన్ని నివారిస్తుంది. కరివేపాకులో మహానింబైన్ అనే ఆల్కలాయిడ్‌కు యాంటీ ఒబెసిటీ , యాంటీ – లిపిడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link