PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ముప్పై దాటినా.. స్వీట్‌ 16 లా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాలి..!


Women Diet Plan: ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మన శరీర పని తీరు మందగిస్తూ వస్తుంది, అంతకముందులా యాక్టివ్‌గా పనులు చేయలేం. వృద్ధాప్య ప్రభావం నెమ్మదిగా కనిపించడం స్టార్ట్‌ అవుతుంది. ముఖంపై ముడతలు, గీతలు ఏర్పడతాయి. ఇవి మాత్రమే కాదు, 30 దాటిన తర్వాత.. గుండె జబ్బులు, డయాబెటిస్‌, క్యాన్సర్, ఆస్టియోపోరోసిస్‌, రక్తహీనత, థైరాయిడ్‌ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ముప్పు కూడా పెరుగుతుంది. ఈ వయస్సు.. మహిళలకు ముఖ్యమైన దశ అని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఈ దశలో కెరీర్‌, కుటుంబం, పిల్లలు, కుటుంబ బాధ్యతలు వారి మీద ఉంటాయి. సహజంగానే ఇవన్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. 30 ఏళ్ల వయస్సులో, డైట్‌ విషయంలో సరైన కేర్‌ తీసుకోకపోతే.. శరీరంలో బలహీనంగా మారుతుందని, వృద్ధాప్య ఛాయలు త్వరగా స్టార్ట్‌ అవుతాయని పోషకాహార నిపుణురాలు, ఫ్యాట్ టూ స్లిమ్ డైరెక్టర్, డైటీషియన్‌ శిఖా అగర్వాల్ శర్మ అన్నారు. ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ముఫ్పై ఏళ్లు దాటిన తర్వాత మహిళల డైట్‌ ప్లాన్‌ ఎలా ఉండాలో శిఖా అగర్వాల్ శర్మ మనకు వివరించారు.

ఫైబర్‌ ఎక్కువగా తీసుకోండి..

ఈ వయస్సులో, మీరు మీ ఆహారంలో ఫైబర్ కంటెంట్‌ను పెంచాలని శిఖా అగర్వాల్‌ సూచించారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, జీవక్రియను నిర్వహించడానికి ఫైబర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వయస్సులో బరువు వేగంగా పెరుగుతారు.. బరువును కంట్రోల్‌లో ఉంచడానికి ఫైబర్‌ సహాయపడుతుంది. క్యాన్సర్లు, గుండె జబ్బు, డయాబెటిస్‌, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచెందుకు ఫైబర్‌ ప్రయోజకరంగా ఉంటుంది. పీచు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకు 40 గ్రాముల ఫైబర్‌ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా చేర్చుకోవాలి. విత్తనాలు, దంపుడు బియ్యం, బార్లీ, ఓట్స్‌‌లోనూ ఫైబర్‌ అధికంగా ఉంటుంది.

(image source – pixabay)

హార్మోన్ బ్యాలెన్సింగ్ ఫుడ్స్‌..

హార్మోన్ బ్యాలెన్సింగ్ ఫుడ్స్‌..

ఈ వయస్సులో హార్మోన్‌ పనితీరులో మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి, ఇది హార్మోన్‌ అసమతుల్యతకు దారి తీస్తుంది. హార్మోన్లను బ్యాలెన్స్‌ చేసుకోవడం చాలా అవసరం. మీరు 30 దాటితో అశ్వగంధ, తులసి, మాకా వేరు పొడిని వంటి వాటితో టీ చేసుకుని తాగండి. ఇవి హార్మోన్ స్థాయిని మెయింటెయిన్ చేయడంలో సహాయపడతాయి. ఇవి కాకుండా.. బ్రకోలీ, యాపిల్స్‌, పొద్దుతిరుగుడు విత్తనాలు, గ్రీన్ టీ, బెర్రీస్‌, గుమ్మడి గింజలను మీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది.

(image source – pixabay)

ఐరన్‌ రిచ్‌ ఫుడ్స్‌..

ఐరన్‌ రిచ్‌ ఫుడ్స్‌..

అలసట, బలహీనత రక్తహీనత ప్రధాన లక్షణాలు. మహిళలు 30 ఏళ్లు దాటిన తర్వాత వాళ్లు ఎదుర్కొనే ప్రధాన సమస్య రక్తహీనత. ఐరన్ లోపం వల్ల రక్తహీనత వస్తుంది. ఐరన్ లోపం ఉంటే హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరంలో హిమోగ్లోబిన్‌ తయారీకి ఐరన్‌ చాలా అవసరం. రక్తహీనతకు చెక్‌ పెట్టడానికి మీ డైట్‌లో ఐరన్‌ సమృద్ధిగా ఉండే.. నువ్వులు, కిస్‌మిస్‌, బఠానీలు, గుమ్మడి గింజలు, ఆకుపచ్చ కూరగాయలు, బెల్లం, బీన్స్‌, బఠానీలు, గుమ్మడి గింజలు తీసుకోండి.

(image source – pixabay)

Also Read:నిద్రపోయే ముందు.. నువ్వుల నూనె అక్కడ రాసుకుంటే హాయిగా పడుకుంటారు..!

అయోడిన్, ఫోలేట్ ముఖ్యమే..

అయోడిన్, ఫోలేట్ ముఖ్యమే..

మీరు 30 ఏళ్ల తర్వాత పిల్లలను ప్లాన్‌ చేసుకుంటుంటే.. కాంప్లికేషన్స్‌ను నివారించడానికి అయోడిన్‌, ఐరన్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు చాలా అవసరం. ఈ పోషకాలు గర్భధారణ సమయంలో సమస్యలను నివారించడానికి, బిడ్డ ఆరోగ్యానికి ఈ పోషకాలు సహాయపడతాయి. మీ డైట్‌లో బీన్స్‌, పాలకూర, సిట్రస్‌ పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి.

(image source – pixabay)

ఎముకల బలంగా ఉండాలంటే..

ఎముకల బలంగా ఉండాలంటే..

మహిళల్లో 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలుబలహీనమవుతూ ఉంటాయి. ఈ సమయంలో విటమిన్ డితో పాటు కాల్షియం తీసుకోవడం చాలా అవసరం. మహిళలకు రోజుకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం అవసరం. ఎముకలను దృఢంగా ఉంచుకోవడానికి కాల్షియం సమృద్ధిగా ఉండే పాలు, పెరుగు, చీజ్‌, చియా గింజలు, కాటేజ్ చీజ్, బ్రోకలీ, బాదం మీ ఆహారంలో చేర్చుకోండి. (image source – pixabay)

Also Read:ఈ ఆసనాలు ప్రాక్టిస్‌ చేస్తే.. ఎముకలు బలంగా ఉంటాయ్..!

యాంటీఆక్సిడెంట్స్‌..

యాంటీఆక్సిడెంట్స్‌..

ఫ్రీరాడికల్స్‌ కణాలను దెబ్బతీస్తాయి.. దీని కారణంగా వృద్ధప్య ఛాయలు త్వరగా కనిపిస్తాయి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, వాటిని తొలగించడానికి యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. గ్రీన్‌ టీ, బ్లాక్‌ రైస్‌, పండ్లు మీ డైట్‌లో చేర్చుకోండి. (image source – pixabay)

Also Read:ఫోన్‌, కంప్యూటర్‌ ఎక్కువగా వాడుతున్నారా..? అయితే మీ కళ్లకు ఈ సమస్య తప్పదు..!

ఈ జాగ్రత్తలు తీసుకోండి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి.
  • ఈ వయస్సు తర్వాత, బీపీ పెరిగే ప్రమాదం ఉంది. మీ ఆహారంలో పోటాషియం మెండుగా ఉండే..బంగాళాదుంపలు, బీన్స్, అరటిపండు, టమాటా వంటి ఆహారాన్ని ఎక్కువగా తినాలి.
  • ప్రొటీన్‌ – రిచ్ ఫుడ్స్‌ కండరాలు, ఎముకలను బలంగా మారుస్తాయి. అలసట, నిస్సత్తువ లాంటివి దరిచేరకుండా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. మీ ఆహారంలో చీజ్, గుడ్లు, చికెన్, పీనట్‌ బటర్‌, చిక్కుళ్లు ఎక్కువగా చేర్చుకోండి.
  • ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, గుండె సమస్యలను నివారించడానికి సహాయపడతాయి. దీని కోసం మీరు చేపలు, వాల్‌నట్‌లు, చియా విత్తనాలు ఎక్కువగా తీసుకోవాలి.
  • ఈ వయస్సులో మీరు మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తినాలి, నీళ్లు ఎక్కువగా తాగాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More :Health NewsandTelugu News



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *