[ad_1]
Stock Market News in Telugu: ఈ ఏడాది దీపావళి ముహూరత్ ట్రేడింగ్ (ఆదివారం, 12 నవంబర్ 2023) చాలా పాత రికార్డులను చెరిపేసింది. స్టాక్స్ నంబర్, టర్నోవర్‌లో కొత్త హైట్స్‌కు చేరింది. ఈ ఏడాది ముహూరత్ ట్రేడ్‌లో 2,431 NSE లిస్టెడ్ కంపెనీల్లో లావాదేవీలు జరిగాయి, ఇది ఆల్ టైమ్ హై రికార్డ్. అంతేకాదు, గత ఏడాదితో పోలిస్తే, ఈసారి రూ.14,091 కోట్ల రికార్డ్ రేంజ్ హై టర్నోవర్ నమోదైంది.
ఆదివారం సాయంత్రం ఒక గంట పాటు జరిగిన ముహూరత్ ట్రేడింగ్ తర్వాత, సెన్సెక్స్ 354.77 పాయింట్లు లేదా 0.55% పెరిగి 65,259.45 వద్ద ముగిసింది, నిఫ్టీ 50 100.20 పాయింట్లు లేదా 0.52% జంప్ చేసి 19,525.55 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 176.55 పాయింట్లు లేదా 0.40% లాభపడి 43,996.65 వద్ద ఆగింది.
జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రకారం, BSE స్మాల్ క్యాప్ & భారత్ 22 ఇండెక్స్ వరుసగా 38,901.61 & 6,338.20 వద్ద జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. రియాల్టీ, ఆటో, మెటల్స్, పవర్, ఎనర్జీ, ఆయిల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో భారీ ర్యాలీ కనిపించింది.
NSEకి సంబంధించి జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్లడించిన కీలక ట్రెండ్స్:
* సంవత్ 2080 ప్రారంభ రోజున (ముహూరత్ ట్రేడింగ్ 2023), NSEలోని 2,431 స్టాక్స్‌లో ట్రేడ్స్ జరిగాయి, ఇది కొత్త గరిష్టం. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే, ట్రేడింగ్‌లో పాల్గొన్న కొత్త లిస్టెడ్ కంపెనీల నంబర్ కూడా ఒక రికార్డే.
* ముహూరత్ ట్రేడ్ రోజున రూ.14,091.3 కోట్ల టర్నోవర్ నమోదైంది, ఇది ఆల్-టైమ్ హై. 2022తో పోలిస్తే ఇది 34.7% జంప్.
* ముహూరత్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ & నిఫ్టీ వరుసగా ఆరోసారి పాజిటివ్ నోట్‌లో ముగిశాయి.
* 80% సెక్యూరిటీలు ఆ రోజున పెరిగాయి, 16% క్షీణించాయి, 3% మారలేదు. అడ్వాన్స్/డిక్లైన్ రేషియో 4.90గా ఉంది. ఇది వరుసగా 6వ సంవత్సరం 3 కన్నా పైన కొనసాగింది.
మొత్తం టర్నోవర్‌లో కంపెనీల వాటా:
* మొత్తం టర్నోవర్‌లో టాప్ 50 కంపెనీల వాటా 41%కి పడిపోయింది, ఇది కొత్త కనిష్ట స్థాయి. 2008 నుంచి 2018 వరకు ఈ షేర్ క్రమంగా క్షీణించి 2019లో పెరిగింది.
* టర్నోవర్ పరంగా 51 నుంచి 100 ర్యాంక్‌ల మధ్య ఉన్న కంపెనీల వాటా 14.3%గా ఉంది, గత సంవత్సరంతో పోలిస్తే తగ్గింది.
* 101 నుంచి 200 ర్యాంకుల మధ్య ఉన్న కంపెనీలది మొత్తం టర్నోవర్‌లో 14% షేర్. ఇది కూడా 2022 నుంచి తగ్గింది.
* 201 నుంచి 500 మధ్య కంపెనీ షేరు 18.5%కు పెరిగింది, ఇది కొత్త గరిష్టం.
* మిగిలిన కంపెనీల సంఖ్య 1,931. మొత్తం టర్నోవర్‌లో వీటి వాటా దాదాపు రెట్టింపై 12.3%కు చేరుకుంది.
ముహూరత్ ట్రేడింగ్ 2023 నాడు… BSEలో మొత్తం 3,713 స్టాక్స్ ట్రేడయ్యాయి. వాటిలో 2,904 స్టాక్స్ లాభపడ్డాయి, 688 స్టాక్స్ నష్టపోయాయి, మిగిలిన 121 స్టాక్స్ మారలేదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: గత పదేళ్లలో, దీపావళి-దీపావళి మధ్యకాలంలో ఏది ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టింది?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link