Reliance Future Plans: రిలయన్స్ ఇండస్ట్రీస్ సముద్రం (ఇంధనం) నుంచి ఆకాశం (టెలికాం) వరకు చాలా రకాల బిజినెస్‌లు ఉన్నాయి. RIL అధినేత, కొమ్ములు తిరిగిన వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీ, కేవలం మూడు రంగాల మీదే ఫోకస్‌ పెట్టారు, వాటిలోకే పెట్టుబడులు పెంచుతున్నారు. అవి… టెలికాం, గ్రీన్ ఎనర్జీ, ఎఫ్‌ఎంసీజీ.

RIL, 3.5 లక్షల కోట్ల రూపాయల క్యాపెక్స్‌ ప్లాన్‌లో ఉంది. ఈ మొత్తంలో, వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ఖర్చు చేయాలన్నది ముఖేష్ అంబానీ ప్లాన్‌. రానున్న కొంత కాలంలో, టెలికాం, గ్రీన్ ఎనర్జీ, FMCG రంగాల్లోకి పెట్టుబడులు పెరగవచ్చని ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్‌ చేసింది.

ఏ రంగంలో ఎంత పెట్టుబడికి ప్లాన్ చేస్తున్నారు?
అంబానీ.. 5G కోసం రూ. 2 లక్షల కోట్లు కేటాయించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్మిస్తున్న 5 గిగా ఫ్యాక్టరీల కోసం రూ.75,000 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2027 నాటికి పెట్రో కెమికల్స్‌ కెపాసిటీల విస్తరణకు మరో రూ.75,000 కోట్లు వెచ్చించనున్నారు. గత రెండేళ్లలో, రిలయన్స్‌ మొత్తం మూలధన వ్యయంలో 98 శాతం డబ్బు లాభాల నుంచే సమకూరినట్లు వాటాదార్లకు రాసిన లేఖలో ముఖేష్ అంబానీ వెల్లడించారు. బలమైన, సాంప్రదాయిక బ్యాలెన్స్ షీట్ నిర్వహించడం వల్ల ఇది సాధ్యమైందని ఆ లేఖలో వివరించారు.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అప్పు ఇది
ఫార్చ్యూన్ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం… 2023 మార్చిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం అప్పు రూ.3.14 లక్షల కోట్లు. ఇందులో స్టాండలోన్ డెట్‌తో పాటు ఇతర అనుబంధ కంపెనీలపై 2.16 లక్షల కోట్ల రుణ భారం ఉంది. రిలయన్స్ రిటైల్‌కు రూ.46,644 కోట్లు, రిలయన్స్ జియోకు రూ.36,801 కోట్లు, ఇండిపెండెంట్ మీడియా ట్రస్ట్ గ్రూప్‌ (Independent Media Trust Group) నెత్తిన రూ.5,815 కోట్లు, రిలయన్స్ సిబుర్ ఎలాస్టోమర్స్‌ (Reliance Sibur Elastomers) ఖాతాల్లో రూ.2,144 కోట్ల అప్పులు ఉన్నాయి.

వాట్‌ నెక్ట్స్‌?
RIL ఐదు గిగా ఫ్యాక్టరీల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే, సౌర శక్తి నుంచి 100 GW విద్యుత్‌ను ఉత్పత్తి చేసే కెపాసిటీని రిలయన్స్‌ సృష్టించగలదు. అంబానీ కంపెనీ కూడా, 2035 నాటికి ‘నెట్‌ కార్బన్ జీరో’ను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కారణంగా గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులను పెంచడం, దానికి సంబంధించిన ఫ్యాక్టరీలను వేంగా అభివృద్ధి చేయడం కొనసాగుతోంది.

రిలయన్స్ జియో, 5Gలో ముందంజలో ఉండటానికి హైయెస్ట్‌ బిడ్ వేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ లోపు దేశంలోని అన్ని మూలలకు 5Gని అందుబాటులోకి తీసుకురావాలనేది ఈ కంపెనీ ప్లాన్. ‘2G రహిత భారత్’ విజన్‌కు అనుగుణంగా పని చేస్తున్నామని రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ ఇటీవలి మీటింగ్‌లో చెప్పారు.
 
రిలయన్స్‌ FMCG విభాగానికి కమాండర్‌ ఇషా అంబానీ. ఇటీవలి కాలంలో, ఈ విభాగం చాలా కొత్త ఉత్పత్తులను విడుదల చేసి మార్కెట్‌ వాటాను, కొత్త కంపెనీలను కొని వ్యాపార పరిధిని పెంచుకుంది.

FY23లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.73,670 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. FY22తో పోలిస్తే ఈ లాభం 11.3 శాతం పెరిగింది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ధర గత నెల రోజుల్లో 4% పైగా తగ్గింది. గత 6 నెలల కాలంలో ఫ్లాట్‌గా ఉంది, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 6% క్షీణించింది. గత 5 సంవత్సరాల కాలంలో 91% రిటర్న్స్‌తో ఇన్వెస్టర్లకు దాదాపు రెట్టింపు లాభాలు ఇచ్చింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌ నమ్మకాన్ని కోల్పోయిన 10 బడా కంపెనీలు, ఈ స్టాక్స్‌ మీ దగ్గర ఉంటే జాగ్రత్త సుమా!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *