మూత్రంలో రక్తం వస్తే.. కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతమా..?

[ad_1]

Kidney Cancer Symptoms: కిడ్నీ క్యాన్సర్‌ ప్రారంభ లక్షణాలను సంకేతాలను గుర్తిస్తే వల్ల చికిత్స విజయవంతం కావడానికి అవకాశలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండ క్యాన్సర్ అత్యంత సాధారణ సంకేతాలలో హెమటూరియా ఒకటి. హెమటూరియా అంటే.. మూత్రంలో రక్తం రావడం. కిడ్నీ క్యాన్సర్‌ స్టార్టింగ్‌ స్టేజ్‌లో లో ఇతర సమస్యలు, నొప్పి, అసౌకర్యం ఉందడు. కానీ, మూత్రంలో రక్తం ఉంటే మాత్రం అనుమానించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో, కిడ్నీ క్యాన్సర్‌లో మూత్రంలో రక్తం ఉన్నా కూడా నొప్పి ఉండదు. రక్తం ఎల్లప్పుడూ కనిపించాల్సిన అవసరం లేదు, కానీ మూత్ర పరీక్షల్లో రక్తాన్ని గుర్తించవచ్చు. ఈ రోజు ప్రపంచ క్యాన్సర్‌ డే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్‌ డేను జరుపుకుంటారు. కాన్సర్ గురించి అవగాహన పెంపొందించడానికి, దాని నివారణ, గుర్తింపును, చికిత్సను ప్రోత్సహించేందుకు ప్రపంచవ్యాప్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లలిత్ శర్మ కిడ్నీ క్యాన్సర్ క్యాన్సర్‌ గురించి మనకు వివరించారు. (Dr. Lalit Sharma, Consultant Medical Oncology at Manipal Hospitals, Jaipur).

ఈ లక్షణాలు కనిపిస్తాయి..

ఈ లక్షణాలు కనిపిస్తాయి..

కిడ్నీ క్యాన్సర్‌లో సాధారణంగా మూత్రంలో రక్తాన్ని గుర్తించవచ్చు. కిడ్నీ ప్రాంతంలో గడ్డ/కణితి, అలసట, మైగ్రెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అనారోగ్యంగా అనిపించడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, లో జ్వరం, ఎముకల నొప్పి, అధిక రక్తపోటు, రక్తహీనత, రక్తంలో అధిక కాల్షియం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మూత్రపిండ క్యాన్సర్ కాకుండా అనేక కారణాల వల్ల మూత్రంలో రక్తం కనిపించవచ్చు. సిస్టిటిస్‌, యూటీఐ, మూత్రాశయం, ప్రోస్టేట్ క్యాన్సర్, బ్లడ్ థిన్నర్స్ అధిక మోతాదులో తీసుకున్నా, మూత్రాశయ క్యాన్సర్‌ కారణంగానూ.. మూత్రంలో రక్తం కనిపిస్తుంది.

ఎందుకొస్తుంది..?

ఎందుకొస్తుంది..?

కిడ్నీ క్యాన్సర్‌కు ఖచ్చితమైన కారణం తెలియదు. కొన్ని ప్రమాదకర కారకాల కారణంగా.. కిడ్నీ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుంది. స్మోకింగ్‌, ఊబకాయం, అధిక రక్తపోటు, కుటుంబ చరిత్ర, రేడియేషన్ ఎక్స్పోజర్ కారణంగా కిడ్నీ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

క్యాన్సర్‌ని నిర్ధారించడానికి పరీక్షలు..

క్యాన్సర్‌ని నిర్ధారించడానికి పరీక్షలు..
  • మూత్ర పరీక్ష
  • రక్త పరీక్ష
  • CT స్కాన్
  • అబ్డోమెన్‌ ట్యూమర్ బయాప్సీ MRI

కిడ్నీ క్యాన్సర్ ప్రమాదమా..?

కిడ్నీ క్యాన్సర్ ప్రమాదమా..?

ఇది దాని దశపై ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ దశ కణితి స్థానం, పరిమాణం, ఎన్ని శోషరస గ్రంథులు ప్రభావితమయ్యాయి, క్యాన్సర్ ఎంతవరకు వ్యాపించింది, ఏ కణజాలాలు, అవయవాలకు వ్యాపించిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్‌ మొదటి దశలో.. స్టేజ్‌ 1, స్టేజ్‌ 2 ఉంటాయి. ఇందులో కణితి కిడ్నీలో మాత్రమే ఉంటుంది. కిడ్నీ క్యాన్సర్‌ 3వ దశలో.. చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి ఉంటుంది. స్టేజ్‌ 4 లో క్యాన్సర్‌.. కిడ్నీ దాటి ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది.

చికిత్స..

చికిత్స..

ట్యూమర్‌ దశ, గ్రేడ్‌, పేషెంట్‌ వయస్సు, వారి సాధారణ ఆరోగ్యం.. కిడ్నీ క్యాన్సర్‌ చికిత్సలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. . శస్త్రచికిత్స, టిష్యూ ఎక్సిషన్, రేడియేషన్ థెరపీ, టార్గెటెడ్ డ్రగ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, కొన్నిసార్లు కెమోథెరపీ ట్రీట్మెంట్‌లో ఉంటాయి.

ఎలా నివారించాలి..?

ఎలా నివారించాలి..?

వివిధ క్యాన్సర్లకు కారణాలు కూడా భిన్నంగా ఉంటాయి. కిడ్నీ క్యాన్సర్‌కు కారణాలు, దాని నివారణ చర్యలపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతున్నాయి. కిడ్నీ క్యాన్సర్‌ను పూర్తిగా నివారించలేము, కానీ కొన్ని చర్యలు దాని ప్రమాదాన్ని తగ్గించగలవు.

  • మంచి లైఫ్‌స్టైల్‌ ఫాలో అయితే.. 30 శాతం క్యాన్సర్లకు దూరంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సీజన్‌లో లభించే అన్ని రకాల పండ్లతో పాటు కూరగాయలు, ఆకుకూరలు మీ డైట్‌ తీసుకోవాలి.
  • తృణ ధాన్యాలు కూడా ఆహారంలో చేర్చాలి. . పండ్లు, ఆకుకూరలు, కూరగాయల్లో ఖనిజాలు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి.
  • స్మోకింగ్, ఆల్కహాల్‌ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. శరీర బరువు కంట్రోల్‌లో ఉంచుకోవాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *