PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

మేడమ్‌ సార్‌, మేడమ్‌ అంతే – ఏడాదిలోనే రెండంకెల లాభాలు


Stock Market News: ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి, స్త్రీలు సబలలంటూ పొగుడుతున్నాయి. దలాల్ స్ట్రీట్‌ కూడా తన స్టైల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం కోసం, కొంతమంది మహిళా వ్యాపార సారథులను మీ ముందుకు తీసుకువస్తున్నాం.

ఈ అతివల నాయకత్వంలో నడుస్తున్న కంపెనీల్లో కనీసం 10 కౌంటర్లు గత ఒక సంవత్సర కాలంలో సానుకూల రాబడిని ఇచ్చాయి, వీటిలో 7 స్టాక్స్‌ రెండంకెల ఆదాయాన్ని అందించాయి.

ఈ ఏడింటిలో టాప్ 4 కంపెనీలు కన్స్యూమర్ స్టేపుల్స్ & డిస్క్రిషనరీ సెక్టార్‌కు చెందిన కంపెనీలు.

మహిళల సారథ్యంలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న 10 కంపెనీలు: 
గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా, మెట్రో బ్రాండ్స్, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇంజినీర్స్ ఇండియా, థర్మాక్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సింజీన్ ఇంటర్నేషనల్, JK సిమెంట్, టాటా కమ్యూనికేషన్స్.

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా, గత ఏడాది కాలంలో దాదాపు 86% రాబడిని ఇన్వెస్టర్లకు తిరిగి అందించింది. బెంచ్‌మార్క్ సూచీలు, ఈ సెక్టార్ మేజర్ ITC కంటే చాలా ఎక్కువ. భారతదేశంలోని అతి పెద్ద పొగాకు కంపెనీల్లో గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా ఒకటి. బీనా మోడీ నేతృత్వంలో నడుస్తోంది. 

రెండో కంపెనీ ఇమెట్రో బ్రాండ్స్‌. ఈ ఫుట్‌వేర్ రిటైలర్ షేర్లు గత 1 సంవత్సరంలో దాదాపు 52% లాభపడ్డాయి. 2022 అక్టోబర్‌ నెలలో జీవిత కాల గరిష్ట స్థాయి రూ. 980.85కి చేరాయి. గత ఏడాది కాలంలో నిఫ్టీ50 కంటే 46% అధిక లాభాలను ఈ స్టాక్‌ కురిపించింది. మూడో తరం వ్యవస్థాపకురాలు, ఫరా మాలిక్ భాంజీ ఈ 72 ఏళ్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నారు.

అమెరికన్ పాపులర్ ఫాస్ట్ ఫుడ్ చైన్‌ మెక్‌డొనాల్డ్స్‌ను భారత్‌లో నిర్వహిస్తోంది వెస్ట్‌లైఫ్ ఫుడ్‌ వరల్డ్. ఈ కంపెనీ షేర్లు గత 1 సంవత్సరంలో 48% లాభపడ్డాయి. క్విక్‌-సర్వీస్‌ రెస్టరెంట్ పరిశ్రమలో 2 దశాబ్దాల అనుభవం ఉన్న స్మిత జటియా ఈ కంపెనీని నడిపిస్తున్నారు.

FMCG స్పేస్‌లో ఉన్న గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (GCPL),  గత 1 సంవత్సరంలో 26% పైగా రాబడిని ఇచ్చింది. ఇదే కాలంలో 18% రాబడిని అందించిన సెక్టార్ పెద్ద హిందుస్థాన్ యూనిలీవర్‌ను కూడా ఈ స్టాక్ అధిగమించింది. GCPL చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ అయిన నిసాబా గోద్రెజ్, తన కంపెనీ అంతర్జాతీయ పరిధిని పెంచడంలో కీలకపాత్ర పోషించారు. 

మిగిలిన కంపెనీల్లో… జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత ఏడాది కాలంలో 26 శాతం రాబడిని, థర్మాక్స్ 19 శాతం, ఇంజినీర్స్ ఇండియా 16 శాతం లాభాలను పెట్టుబడిదార్లకు అందించాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *