Top Headlines Today:

కొత్త సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ 

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. కొత్తగా నిర్మించిన బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స‌చివాల‌యంలో తొలిసారి రాత్రి మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మే 18న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మొదలుకానున్న ఈ మంత్రివ‌ర్గ స‌మావేశంలో కీల‌క నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నందన సంక్షేమ పథకాల అమలు, నిధుల విడుదలపై కీలకంగా చర్చ జరగనుంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున బీసీ బంధు, దళిత బంధు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పించన్ల పంపిణీ అమలు తీరుపై చర్చించనున్నారు.

శృంగవరపుకోటలో చంద్రబాబు టూర్

శృంగవరపుకోటలో జరిగే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో  టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గోనున్నారు. అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుకు చింతలపాలెం నియోజకవర్గంలోకి అడుగు పెట్టనున్న చంద్రబాబు భీమసింగి చెరకు రైతులతో మాట్లాడతారు. తర్వాత కొత్తూరు శివాలయం నుంచి రోడ్‌షో నిర్వహించి దేవిబొమ్మ జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య పేరు నేడు ప్రకటన

సుదీర్ఘ చర్చల అనంతరం కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏకాభిప్రాయానికి వచ్చారు. శనివారం (మే 20) బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. సిద్ధరామయ్య పేరును అధికారికంగా ఖరారు చేసేందుకు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి తీసుకోనున్నారు. 

నేడు ఐపీఎల్‌లో 

ఐపీఎల్‌ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు పోటీ పడనున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న సన్‌రైజర్స్‌  ఎలాంటి అద్భుతాలు చేస్తుందో అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. పంజాబ్, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ చూసిన వాళ్లకు ఇదే అనుమానం వస్తోంది. రాజస్థాన్‌పై భారీ విక్టరీ సాధించిన బెంగళూరు అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

M M ఫోర్జింగ్స్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో M M ఫోర్జింగ్స్ నికర లాభం అనేక రెట్లు పెరిగి రూ. 30 కోట్లకు చేరుకుంది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ. 387 కోట్లుగా ఉంది.

GIC హౌసింగ్ ఫైనాన్స్: 2022-23 నాలుగో త్రైమాసికంలో రూ. 52.3 కోట్ల నికర లాభాన్ని జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 281 కోట్లుగా ఉంది

షీలా ఫోమ్: 2023 జనవరి-మార్చి కాలంలో షీలా ఫోమ్ నికర లాభం 9% తగ్గి రూ. 45 కోట్లకు పరిమితమైంది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 729 కోట్ల ఆదాయం వచ్చింది.

JSW స్టీల్: మహారాష్ట్రలో అన్‌-ఎక్స్‌ప్లోర్డ్‌ ఇనుప ఖనిజం గని కాంపోజిట్‌ లైసెన్స్ కోసం ప్రాధాన్య బిడ్డర్‌గా JSW స్టీల్ నిలిచింది.

వేదాంత్ ఫ్యాషన్స్: వేదాంత్ ఫ్యాషన్స్ ప్రమోటర్ అయిన రవి మోదీ ఫ్యామిలీ ట్రస్ట్, ఈ కంపెనీలో 7% వరకు వాటాలను OFS ద్వారా విక్రయించాలని యోచిస్తోంది. ఒక్కో షేరు ధర రూ. 1,161 గా నిర్ణయించారు

రైల్‌టెల్ కార్పొరేషన్: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 76 కోట్ల నికర లాభాన్ని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆర్జించింది. ఆ త్రైమాసికంలో సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ. 703 కోట్లుగా ఉంది.

హనీవెల్ ఆటోమేషన్: 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో హనీవెల్ ఆటోమేషన్ నికర లాభం 112 రూపాయలుగా లెక్క తేలింది. అదే కాలంలో కంపెనీకి 850 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.

JK టైర్: జనవరి-మార్చి కాలంలో రూ. 108 కోట్ల నికర లాభాన్ని JK టైర్ నమోదు చేసింది. ఇదే కాలంలో ఆదాయం రూ. 3,632 కోట్లుగా ఉంది.

REC: నాలుగో త్రైమాసికంలో REC నికర లాభంలో 33% వృద్ధిని సాధించి రూ. 3,065 కోట్లకు చేరుకుంది. అదే త్రైమాసికంలో ఆదాయం రూ. 10,243 కోట్లుగా ఉంది.

వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా: Q4FY23లో వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా రూ. 63 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. రూ. 1,672 కోట్ల ఆదాయం వచ్చింది.

GSK ఫార్మా: మార్చితో ముగిసిన త్రైమాసికంలో జీఎస్‌కే ఫార్మా రూ. 133 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.787 కోట్లుగా ఉంది.

HDFC బ్యాంక్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 9.99% వరకు వాటాను కొనుగోలు చేయడానికి ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది.

జిందాల్ స్టెయిన్లెస్: నాలుగో త్రైమాసికంలో జిందాల్ స్టెయిన్‌లెస్ నికర లాభం రూ. 766 కోట్లు, ఇదే కాలానికి ఆదాయం రూ. 9,765 కోట్లుగా ఉంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *