Reliance AGM 2023: రిలయన్స్ రిటైల్ విలువ రెట్టింపు అయింది. 2020 సెప్టెంబర్లో రూ.4.28 లక్షల కోట్లుగా ఉన్న విలువ ప్రస్తుతం రూ.8.28 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఇన్వెస్టర్లు రిలయన్స్ రిటైల్ వైపు చూస్తున్నారు. డిజిటల్, న్యూ కామర్స్ సేల్స్ రూ.50,000 కోట్లుగా ఉన్నాయి. నమోదిత కస్టమర్లు 25 కోట్లకు చేరుకున్నారు. 2023 ఆర్థిక ఏడాదిలో 78 కోట్ల మంది స్టోర్లను సందర్శించారని ఇషా అంబానీ అన్నారు.