[ad_1]
భరించలేని స్థాయికి ధరలు
పేద, మధ్యతరగతి వర్గాలు భరించలేని స్థాయికి మొబైల్ రీఛార్జి ధరలు పెరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్యులపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో.. ప్రత్యేకంగా ఇన్ కమింగ్ మరియు SMS సేవల వినియోగానికి తక్కువ ధరలో ప్యాక్ లు అందించేందుకు TRAI ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కనెక్టివిటీ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో అతి ముఖ్యమైన భాగం కాగా.. ధరల పెరుగుదల వల్ల ఉన్నత వర్గాలు మినహా ఇతరులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండటం లేదని ఆ సంస్థ భావిస్తోంది.
దశలవారీగా టారిఫ్ పెంపు
ప్రస్తుతం మార్కెట్ పరిస్థితిని గమనిస్తే, ARPUని పెంచుకునే పనిలో టెల్కోలు ఉన్నాయి. ఎయిర్ టెల్ ప్రాథమిక బేస్ ప్లాన్ గతంలో రూ.99 నుంచి మొదలయ్యేది కానీ ఇప్పుడు రూ.155కి పెంచినట్లు నివేదిక పేర్కొంది. కొన్ని సర్కిళ్లలో ఈ ధరలు అమలుచేయగా.. త్వరలోనే మిగిలిన వాటిలోనూ టారిఫ్ లు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.
ఒక్కసారిగా పెద్దఎత్తున రేట్లు పెంచితే వినియోగదారులు దూరమవుతారని, దశలవారీగా అమలుచేస్తే కస్టమర్లు కుదురుకుంటారనే ప్లాన్ లో టెల్కోలు ఉన్నట్లు అభిప్రాయపడింది.
ఇన్ కమింగ్ అయినా భారమే..
అయితే ట్రాయ్ చేసిన ఈ ప్రతిపాదన పట్ల టెలికం కంపెనీలు(టెల్కోలు) విముఖత చూపిస్తున్నట్లు వార్తా సంస్థ పేర్కొంది. ఒక్కో వినియోగదారుడి నుంచి సమకూరుతున్న సరాసరి ఆదాయం(ARPU) పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న తమ లక్ష్యాలు నెరవేరవని వాదిస్తున్నట్లు తెలిపింది. ఇన్ కమింగ్ లేదా అవుట్ గోయింగ్ ఏదైనా సరే నెట్వర్క్ వినియోగం తప్పనిసరి కాబట్టి.. తక్కువ ధర ప్లాన్ లు తీసుకొస్తే తమ వనరుల వినియోగం భారీగా పెరుగుతుందని ఓ కంపెనీ ప్రతినిధి చెప్పినట్లు వెల్లడించింది.
అధికారిక ప్రతిపాదన లేదు కానీ..
దీనిపై నియంత్రణ మండలి అధికారికంగా ప్రతిపాదించలేదు కానీ ఆఫ్‌లైన్ సంప్రదింపులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రాయ్ నిర్ణయం అమల్లోకి వస్తే, సామాన్యులపై రీఛార్జి భారం తగ్గుతుందనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో ఏమౌతుందో చూడాలి మరి !!
[ad_2]
Source link
Leave a Reply