Sunday, July 25, 2021

మోదీ తల్లిపై అసభ్య దూషణలు -బీబీసీ షోలో ఓ కాలర్ దుస్సాహసం -సిక్కులపై చర్చలో రైతు ఉద్యమం

బీబీసీ రేడియో షోలో..

ప్రఖ్యాత బీబీసీ మీడియా ఆధ్వర్యంలోని బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం ‘బిగ్ డిబేట్’ పేరుతో పలు అంశాలపై రేడియో షోలు నిర్వహిస్తుంటుంది. తాజాగా ఆ షోలో.. యూకేలో సిక్కులు ఇతర భారత సంతతి వారు ఎదుర్కొంటున్న జాత్యహంకార ఉదంతాలపై చర్చ జరిగింది. భారత సంతతికే చెందిన యాంకర్ ప్రియా రాయ్ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించారు. మూడు గంటలపాటు సాగిన లైవ్ చర్చలో భాగంగా పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ రాగా, వారిలో ఓ కాలర్.. ఢిల్లీలో రైతుల ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన తల్లి హీరాబెన్ లను బండ బూతులు తిట్టాడు.

మోదీ తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు

మోదీ తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు

మార్చి 1న లైవ్ లో ప్రసారమైన బీబీసీ రేడియో షోలో ‘సిమోన్’ పేరుగల ఓ కాలర్.. భారత ప్రధాని తల్లిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడాడు. ఆమె జననాంగాన్ని కాలితో తొక్కేస్తానంటూ భయానక దూషణలు చేశాడు. ఈ వ్యవహారంపై బ్రిటన్, భారత్ లోని పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిమోన్ పేరు గల కాలర్ చేసిన ఉన్మాద వ్యాఖ్యల ఆడియో క్లిప్పు ప్రస్తుతం వైరల్ గా మారింది. కాలర్ కామెంట్లు, యాంకర్ ప్రియా రాయ్ నిస్సహాయతను ప్రశ్నిస్తూ, ఈ ఘటనపై బ్రిటన్ టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ‘ఆఫ్ కామ్’ జోక్యం చేసుకోవాలని, సదరు రేడియో ఛానల్ లైసెన్సులను రద్దు చేయాలని భారత సంతతి సంఘాలు, వ్యక్తులు డిమాండ్ చేశారు. కాగా,

viral video:బీజేపీ మంత్రి సెక్స్ వీడియో -కర్ణాటకలో పెను సంచలనం -ఉద్యోగం పేరుతో మహిళను..

సారీ.. లైవ్‌లో ఆపలేకపోయాం..

సారీ.. లైవ్‌లో ఆపలేకపోయాం..

రేడియో లైవ్ డిబేట్ లో భారత ప్రధాని మోదీ తల్లిని ఉద్దేశించి ఓ కాలర్ చేసిన అసభ్యవ్యాఖ్యలపై బీబీసీ ఆసియా నెట్ వర్క్ విభాగం క్షమాపణలు చెప్పింది. 3 గంటల కార్యక్రమాన్ని 1.32గంటలకు ఎడిట్ చేసి, అందులో యాంకర్ ప్రియా రాయ్ క్షమాపణలను కూడా జతచేశారు. ‘‘ఓక హాట్ టాపిక్ పై చర్చ జరుగుతున్న క్రమంలో కాలర్లు ఉద్వేగంగా మాట్లాడటం అప్పుడప్పుడూ జరుగుతుంది. అది లైవ్ షో కాబట్టి అప్పటికప్పుడే ఆపలేకపోయాం. కాలర్ చేసిన పొరపాటుకు క్షమాపణలు కోరుతున్నాం”అని యాంకర్ ప్రియా రాయ్ చెప్పుకొచ్చారు. ఈ వివాదంపై భారత్ వైపు నుంచి అధికారిక స్పందనేదీ వెలువడలేదు.


Source link

MORE Articles

10 Gboard shortcuts that’ll change how you type on Android

If there's one thing we Android-totin' pterodactyls take for granted, it's just how good we've got it when it comes to typing out...

గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను ఓడించేది, గెలిపించేది మీ వాళ్ళే : బండి సంజయ్ సంచలనం

Telangana లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ విత్తన తయారీ దారులు!! గంజాయి ,గుట్కా, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటలను...

‘నయా నిజాం.. కేసీఆర్ చెంప మీద కొట్టే ఎన్నిక ఇది-నన్ను కాదు,నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్’

నీ బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయావ్ : ఈటల 'ఈటల రాజేందర్‌కు కుడి,ఎడమ ఎవరూ ఉండొద్దు... ఆయనకు మనిషులే దొరకద్దు... ప్రాణం ఉండగానే బొందపెట్టాలి అని చూస్తున్నారు. ఇక...

ట్రాన్స్‌జెండర్ అనన్య కుమారి అలెక్స్ భాగస్వామి ఆత్మహత్య… ఆమె చనిపోయిన రెండు రోజులకే…

అనన్య ఆత్మహత్యను తట్టుకోలేకనే...!! బుధవారం(జులై 22) అనన్య కుమారి అలెక్స్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. జిజు ఇంట్లో లేని సమయంలో అనన్య ఆత్మహత్య చేసుకుంది. అనన్య...

కేటీఆర్ పుట్టినరోజునూ వదలని వైఎస్ షర్మిల .. ఆ హృదయం ఇవ్వాలని షాకింగ్ ట్వీట్ తో పాటు కానుక కూడా !!

భగవంతుడు మీకు నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపే మనసు ఇవ్వాలి పుట్టినరోజు సందర్భంగా ఇది మీకు నేను చిన్న కానుక అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కెసిఆర్...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe