Tuesday, May 17, 2022

మోదీ సర్కారు మతి తప్పింది -జనం పోగైతే కూలిపోక తప్పదు -తోమర్‌పై టికాయత్ ఎదురుదాడి

National

oi-Madhu Kota

|

వ్యవసాయ చట్టాలు రైతుల బాగుకోసమేనని కేంద్రం.. వాటిని వెనక్కి తీసుకునేదాకా కదలిలేది లేదంటోన్న రైతులు.. చూస్తుండగానే ఈ ప్రతిష్టంభన మొదలై మూడు నెలలు కావొస్తోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ శివారులో వేలాది రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారం నాటికి 89 రోజులు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతులు, కేంద్రం మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కేంద్రం, రైతు సంఘాల నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరిందిలా..

వాలంటీర్ వ్యవస్థ రద్దుకు డిమాండ్ -అంతలోనే సీఎం జగన్ కీలక ఆదేశాలు -ఇక ప్రపంచ స్థాయిలో..

”ఏదో కొద్ది మంది గుమ్మికూడి ఆందోళన చేసినంత మాత్రాన నిర్ణయాలను వెనక్కి తీసుకునే సవాలే లేదు” అంటూ రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ తీవ్రస్థాయిలో స్పందించారు. మోదీ సర్కారు మతి తప్పినట్లుగా వ్యవహరిస్తున్నదని, జనం భారీ ఎత్తున గుమ్మికూడి ఆందోళనలు చేస్తున్నారంటే సదరు ప్రభుత్వాలు కూలిపోక తప్పదన్న విషయాన్ని గోమర్ గుర్తుంచుకోవాలని రైతు నేత అన్నారు.

ఢిల్లీలో మూడు నెలలుగా ఆందోళనలను కొనసాగుతోన్న ప్రాంతాలకు తోడు, హర్యానా, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో అనేక చోట్ల ‘కిసాన్ పంచాయత్’ పేరుతో భారీ సభలు జరుగుతుండటం, వాటిలో చాలా సభలకు బీకేయూ నేత రాకేశ్ టికాయత్ స్వయంగా హాజరవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి తోమర్ సదరు వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని సోనిపట్ జిల్లా ఖర్ఖోడాలో సోమవారం జరిగిన మరో కిసాన్ పంచాయత్ లో మాట్లాడుతూ టికాయత్.. కేంద్ర మంత్రికి కౌంటరిచ్చారు.

నిమ్మగడ్డ వల్ల జగన్‌‌‌కు నష్టమెంతో తెలుసా? -చతికిలపడ్డా చుక్కల్లో అంకెలా? -ఏపీలోనూ ‘మిషన్ భగీరథ’

ఉద్యమం కోసం సొంత పంటలనే ధ్వంసం చేసిన రైతులకు ప్రభుత్వాన్ని కూల్చడంగానీ మరో పనిగానీ పెద్ద లెక్క కాదని, కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం తప్ప మోదీ సర్కారుకు మరో దారి లేదని టికాయత్ అన్నారు. ”సాగు చట్టాలు, విద్యుత్ (సవరణ) చట్టం.. ఇంతటితో వీళ్లు ఆగిపోరు. ఇవాళ గానీ మనం అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజావ్యతిరేక చట్టాలు ఇంకా చాలా వస్తాయి. నిజానికి ఇప్పుడు జరుగుతున్నది ఒక్క రైతుల ఉద్యమమే కాదు, పేదలు, రోజు కూలీలు, ఇతర వర్గాలది కూడా” అని టికాయత్ అన్నారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe