యమహా ఆవిష్కరించిన E01 మరియు E02 మోడళ్లలో E01 ఈ-స్కూటర్ ఉత్పత్తికి చేరుకోనుంది, E02 మాత్రం ప్రస్తుతానికి కాన్సెప్ట్ గానే మిగిలిపోనుంది. యమహా E01 మ్యాక్సీ స్టైల్ స్కూటర్ రూపంలో రానుంది. పెర్ఫార్మెన్స్ పరంగా ఇది పెట్రోల్‌తో నడిచే 125సిసి స్కూటర్లతో సమానంగా ఉంటుంది.

యమహా E01 ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్లూటూత్ కనెక్టివిటీ, ఏబిఎస్, మార్చగలిగిన బ్యాటరీ, జియో ఫెన్సింగ్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉండనుంది.

ఇకపోతే, యమహా ట్రేడ్‌మార్క్ చేసిన EC-05 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తైవాన్‌కు చెందిన తమ భాగస్వామ్య సంస్థ ‘గోగోరో’తో కలిగి డెవలప్ చేసింది. ఈ స్కూటర్ ఇంకా గ్లోబల్ మార్కెట్లో విడుదల కానప్పటికీ, యమహా ఇప్పటికే దీనిని తైవాన్ మార్కెట్లో విక్రయిస్తోంది.

యమహా EC-05 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏబిఎస్ మరియు యూఎస్బి (హోండా స్కూటర్లలో లభించే సిబిఎస్-కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ మాదిరిగానే యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్)ను కలిగి ఉంటుంది. ఈ స్కూటర్లోని లైట్లన్నింటినీ ఎల్ఈడిలతో తయారు చేశారు.

ఇది జి2 అల్యూమినియం అల్లాయ్ వాటర్-కూల్డ్ మోటర్ మరియు MOSFET వాటర్-కూల్డ్ మోటార్ కంట్రోలర్‌తో రానుంది. ఇది గరిష్టంగా 19.3 కిలోవాట్ శక్తిని మరియు 26 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎలక్ట్రి స్కూటర్ ముందు భాగంలో 245 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు వెనుక వైపు 190 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉంటాయి.

తైవాన్ మార్కెట్లో యమహా EC-05 ఏబిఎస్ వెర్షన్ ధర TWD 1,07,800 తైవాన్ డాలర్లుగా ఉంది. మన దేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.2,79,604 లక్షలుగా ఉంది. ఇకపోతే, యమహా E01 డిజైన్ కూడా చివరి దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తోంది.

భారతదేశంలో కూడా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్తులో యమహా ఓ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.