PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

యాపిల్‌ సీఈవో జీతంలో భారీ కోత, 40 శాతానికి పైగా తగ్గిన ప్యాకేజీ

[ad_1]

Apple CEO Salary: ఐఫోన్ (iPhone) తయారీ సంస్థ యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్‌ కుక్‌ (Apple CEO Tim Cook), తన జీతభత్యాల్లో స్వచ్ఛందంగా భారీ కోతను విధించుకున్నారు. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. తన వేతనాన్ని తగ్గించాలని సీఈవో టిమ్ కుక్ స్వయంగా కంపెనీని అభ్యర్థించారు. ఈ అభ్యర్థన తరువాత, టిమ్‌ కుక్‌ జీతభత్యాలు (compensation) 40 శాతానికి పైగా తగ్గాయి.

తగ్గింపు తర్వాత ఎంత జీతం వస్తుంది?
40 శాతం పైగా కోత తర్వాత, టిమ్ కుక్ వార్షిక జీతం 49 మిలియన్‌ డాలర్లు, అంటే 4 బిలియన్ రూపాయలకు తగ్గింది. 2023 ప్రారంభం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. 

అంతకుముందు… 2022 సంవత్సరంలో, టిమ్‌ కుక్ 99.4 మిలియన్‌ డాలర్లను శాలరీ ప్యాకేజీని వార్షిక జీతంగా అందుకున్నారు. ఇందులో.. 3 మిలియన్‌ డాలర్లు ప్రాథమిక జీతం కాగా, 83 మిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్‌ అవార్డ్స్‌, బోనస్‌లు ఉన్నాయి. వీటితో పాటు రిటైర్‌మెంట్‌ ప్లాన్స్‌కు సంబంధించిన కాంపన్సేషన్‌, భద్రత, విమాన ప్రయాణాలు, విహార యాత్రలు వంటి సదుపాయాల కోసం 46,000 డాలర్లను కూడా కుక్‌ అందుకున్నారు.

అంతకుముందు, 2021లో, టిమ్ కుక్‌కు ఆపిల్‌ కంపెనీ మొత్తం 98.7 మిలియన్‌ డాలర్లు చెల్లించింది. 2022లో ఇది అతి కొద్దిగా పెరిగింది.

news reels

వాటాదారుల అభిప్రాయం, కంపెనీ పనితీరు, కుక్ అభ్యర్థన ఆధారంగా కుక్‌కు అందించే ప్యాకేజీని కుదించాలని నిర్ణయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో యాపిల్‌ ఇంక్‌ పేర్కొంది.

ప్యాకేజీ మీద విమర్శలు
గత ఏడాది టిమ్ కుక్ అందుకున్న 99.4 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీపై చాలా విమర్శలు వచ్చాయి. గత సంవత్సరం CEOకి ఇచ్చిన ప్యాకేజీని చాలా మంది వాటాదారులు వ్యతిరేకించారు, అయితే, మెజారిటీ వాటాదారులు (64 శాతం మంది) ఈ భారీ శాలరీ ప్యాకేజీకి అనుకూలంగా ఓటు వేయడంతో, ఆ ప్రతిపాదన నెగ్గింది. గత సంవత్సరం టిమ్ కుక్‌కు అందిన ఈక్విటీ అవార్డ్స్‌ విలువ 75 మిలియన్‌ డాలర్లు. టిమ్‌ కుక్‌కు ఈ సంవత్సరం అందించే ప్యాకేజీ మీద కూడా వాటాదార్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, కంపెనీ మీద ఒత్తిడి వచ్చింది. దీంతో, వాటాదార్ల అభిప్రాయం ప్రకారం, ఆయన జీతభత్యాలను తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. దీనికి కుక్‌ కూడా అంగీకరించారు. దీంతోపాటు… రిటైర్‌మెంట్‌ నాటికి ఇచ్చే స్టాక్‌ అవార్డ్స్‌  సైజ్‌ను కూడా తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది.

గత ఏడాది కంపెనీ షేర్లు 27 శాతం మేర పతనం అయ్యాయి. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కంపెనీ షేర్లు 2.7 శాతం పెరిగాయి. కంపెనీ మార్కెట్ విలువ 2.122 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.

ప్రస్తుతం టిమ్‌ కుక్‌ వయస్సు 62 సంవత్సరాలు. వయస్సు అన్నది కేవలం ఒక సంఖ్య మాత్రమే అన్నది ఈయన విషయంలో నిజమైంది. 62 ఏళ్ల వయస్సులోనూ 26 ఏళ్ల కుర్రాడిలో ఉన్నంత ఉత్సాహం చూపిస్తారు. తన సంపదను స్వచ్ఛంద సేవ కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలని టిమ్‌ కుక్‌ నిర్ణయించుకున్నారు. 

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *