Saturday, May 8, 2021

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం… ఆరుగురు మృతి,11 మందికి తీవ్ర గాయాలు…


National

oi-Srinivas Mittapalli

|

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ ట్ర‌క్కు, మ‌రో వాహ‌నం ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. 11 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ వారణాసి-జౌన్‌పూర్ బోర్డర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అతివేగం, నిద్ర‌మ‌త్తు ప్ర‌మాదానికి కార‌ణ‌ంగా పోలీసులు భావిస్తున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. వార‌ణాసిలో బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవలి కాలంలో యూపీలో తరుచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల మొరాదాబాద్‌లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 25 మంది గాయపడ్డారు. ఆగ్రా-మొరాదాబాద్ హైవేపై ఓ బస్సు,ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రూ.2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు.

గతేడాది నవంబర్‌లో ఇదే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్-లక్నో జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ప్రయాగ్‌రాజ్‌ వైపు వేగంగా వెళుతున్న ఓ బొలెరో వాహనం.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనుకవైపు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు అక్కడికి పరిగెత్తుకొచ్చారు.Source link

MORE Articles

ఎన్ఎస్ యూఐ మెరుపు ధర్నా.!మంత్రి మల్లారెడ్డి వైద్య కళాశాల వద్ద రచ్చరచ్చ.!

చెరువు భూములు కబ్జా చేసి హాస్పిటల్ నిర్మాణం.. మల్లారెడ్డి ఆసుపత్రిని వెంటనే ఉచిత కరోనా వైద్య హాస్పిటల్ గా మార్చాలని ఎన్ఎస్ యూఐ నాయకులు డిమాండ్...

తెలంగాణలో కొత్తగా 5186 కరోనా కేసులు.. మరో 38 మంది మృతి…

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 5186 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ...

वजन कम करने से लेकर आंखों तक के लिए फायदेमंद है धनिया का पानी, इस तरह करें सेवन, मिलेंगे 12 गजब के फायदे

नई दिल्ली: आज हम आपके लिए लेकर आए हैं धनिया के पानी से होने वाले फायदे..धनिया हर घर के किचन में आराम से...

అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో మాజీ మంత్రి పాత్ర… తెర పైకి సంచలన ఆరోపణలు…

కిషన్ రావు సంచలన ఆరోపణలు... నిజానికి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో చేరిన తర్వాత వామన్‌రావుకు వైద్యం అందలేదని కిషన్ రావు ఆరోపించారు. ఆయనకు మందులు...

నారా లోకేష్ పై క్రిమినల్ కేసు నమోదు.. లోకేష్ ఆ ట్వీట్ పై అనంతలో వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు

అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం టిడిపి కార్య‌క‌ర్త మారుతి‌, సోష‌ల్‌మీడియా వేదిక‌గా ఎమ్మెల్యే అవినీతి అరాచ‌కాల‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని గూండాల‌తో దాడి చేయించారు.(1/3) pic.twitter.com/T8aedmlfm6 — Lokesh...

ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు, కుగ్రామమే అయినా కరోనా కట్టడిలో సక్సెస్..కారణం ఇదే !!

జగిత్యాల జిల్లాలోని రాగోజిపేట్ లో ఒక్క కరోనా కేసు కూడా లేదు కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న సమయంలో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇబ్బడిముబ్బడిగా కరోనా...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe