Wednesday, May 18, 2022

యోగి ఆదిత్యనాథ్‌కు కొవిడ్ వ్యాక్సిన్ -తొలి డోసు తీసుకున్న యూపీ సీఎం -వైరస్ కట్టడికి కఠిన చర్యలు

National

oi-Madhu Kota

|

దేశంలో కరోనా వైరస్ మరోసారి వీరవిహారం చేస్తున్నది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోనూ పెద్ద ఎత్తున కొత్త కేసులు వస్తూ, మూడు నెలల గరిష్టానికి యాక్టివ్ కేసులు చేరాయి. మహమ్మారి కట్టడి కోసం అక్కడి కఠిన చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సగుతున్నది.

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (48) కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. లక్నోలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం ఉదయం నర్సులు ఆయనకు తొలి టీకా డోసు వేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాటించాల్సిన జాగ్రత్తలు, రెండో డోసుకు ఎప్పుడు రావలన్నది సీఎంకు నర్సులు సూచనలు చేశారు. కొవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 45 ఏళ్లు దాటిన అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోనేలా చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించడం తెలిసిందే.

Uttar Pradesh CM Yogi Adityanath receives first dose of Covid-19 vaccine

యూపీలో కరోనా వైరస్ కొత్త కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన లెక్కల ప్రకారం శనివారం ఒక్కరోజే 4,136 కొత్త కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,30,059కి, మొత్త మరణాల సంఖ్య 8,881కి పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 19,738గా ఉంది. కేసులు పెరుగుతుండటంతో..

సీబీఐతో జగన్ రహస్య కాన్ఫరెన్స్ -రియాక్షన్ తప్పదు -వైసీపీ ఎంపీ రఘురామ సంచలనం -బీజేపీకి సవాల్

కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా పలు నియమ నిబంధనలు అమలు చేస్తోంది యూపీ సర్కార్. ఏ ప్రాతంలోనైనా ఒక్క వ్యక్తికి కరోనా సోకినట్లు తెలిస్తే ఆ చుట్టుపక్కల గల 20 ఇళ్లకు సీల్‌ వేస్తూ ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటిస్తున్నారు అధికారులు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్‌ తివారీ జిల్లా అధికారులు, పోలీసులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా అపార్ట్‌మెంట్‌ లో కరోనా పాజిటివ్‌ వ్యక్తి ఉంటే.. ఆ అపార్ట్‌మెంట్‌ మొత్తాన్ని సీల్‌ చేయనున్నారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌ పూర్తయిన తర్వాతే దానిని కంటైన్‌మెంట్‌ జోన్‌ జాబితా నుంచి తొలగించనున్నారు.


Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe