రక్తం పంచుకొని పుట్టి పతనం కోరుతున్నారు.. ప్ర‌భాస్ చాలా గ్రేట్.. మంచు విష్ణు..!

Date:

Share post:


గత కొద్ది రోజులుగా మంచు కుటుంబంలో జరుగుతున్న విభేదాలు, వ్యవహారాల గురించి తెలుగు రాష్ట్రాల్లో హట్‌ టాపిక్గా వార్తలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. గొడవలు , కేసులతో మంచు కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆ వివాదాలు పీక్స్‌కు చేరుకుంటున్న నేపథ్యంలో.. పోలీసులు కౌన్సిలింగ్ ఈ వివాదాలకు కాస్త సబ్ బ్రేక్‌ పడింది. కానీ.. రీసెంట్ గానే మరోసారి వివాదం ముదిరేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండడంతో అంతా సర్దుమనిగిందని భావించారు. కానీ.. ఇలాంటి నేపథ్యంలోనే మళ్లీ అన్నదమ్ముల మధ్యన వార్ మొదలవుతుంది. తాజాగా మంచు విష్ణు, మనోజ్ సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసుకున్నారు. అలా మంచు మనోజ్.. మంచు విష్ణు మధ్య సైలెంట్ వార్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Manchu Manoj comments on Manchu Vishnu Kannappa మంచు విష్ణు కన్నప్పపై మనోజ్ కామెంట్స్

ఈ క్రమంలోనే తాజాగా యూఎస్ వెళ్లిన విష్ణు.. అక్కడ ఓ ఫోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ నెటింట‌ హాట్‌ టాపిక్ గా మారాయి. ప్రభాస్ గురించి ఆయన మాట్లాడుతూ.. రక్తం పంచుకొని పుట్టిన వాళ్లే ఈరోజు నా పతనాన్ని కోరుకుంటుంటే.. ప్రభాస్ మాత్రం నా మంచి కోరి.. నా సక్సెస్ కోరుతున్నాడు. ఎన్ని జన్మలకైనా ప్రభాస్‌కు రుణ‌ప‌డిపోతా అంటూ కామెంట్ చేశాడు. నిజంగా ప్రభాస్‌కు నేను కృతజ్ఞుడిని అంటూ వివరించాడు. దీంతో ప్రస్తుతం విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కన్నప్పలో నటించినందుకుగాను ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదంటూ వెల్లడించిన విష్ణు.. ఆయనకు ఎప్పటికీ రుణపడి పోతాను అంటూ చెప్పుకొచ్చాడు. తను ఎంత పెద్ద స్టార్ అనేది ప్రభాస్కు తెలియదని వివ‌రించాడు.

Vishnu Manchu reveals Prabhas and Mohanlal did cameos in Kannappa for free showing admiration for his father

తన లోకంలో తానే ఉంటాడు అంటూ వెల్లడించాడు. ప్రభాస్‌లా చాలా తక్కువ మంది ఉంటారని.. అంత హంబుల్‌గా ఉండడం చాలా గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపించాడు. గతంలో సైతం మనం ఎప్పటికీ గ్రేట్ ఫ్రెండ్స్ లా ఉండాలని వాళ్లు మాట్లాడుకున్న విషయాలను విష్ణు గుర్తు చేసుకున్నాడు. ఇక మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కన్నప్ప. మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ఐశ్వర్య రాజేష్, కాజ‌ల్‌, సరిత కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముకేశ్ శశి సహ పలువురు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో మెరువనున్నారు. అవా ఎంటర్టైమ్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్.. సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొల్పాయి. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమాలో.. ప్రభాస్ రుద్ర రోల్‌లో కనిపించనున్నాడు. ఆయన కనిపించనున్నది స్పెషల్ రోలే అయినా ప్రేక్షకుల్లో మాత్రం భారీ అంచనాలను నెలకొన్నాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img

Related articles

సల్మాన్ ఖాన్‌కు మూడు జబ్బులు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయింది ఒక్క సల్మాన్ ఖాన్ మాత్రమే. వేర్వేరు సందర్భాల్లో ఆయన ప్రేమాయణాల గురించి పెద్ద...

తమన్నకు హ్యాండ్ ఇచ్చి మరో స్టార్ బ్యూటీని లైన్లో పెట్టిన వర్మ..!

బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు మిల్కీ బ్యూటీ తమన్న తో...

భూమ్మీద నూక‌లున్నాయి.. – Navatelangana

- Advertisement - న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భూమ్మీద నూక‌లుంటే..ఎంత ప్ర‌మాదం జ‌రిగిన ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవ‌ల జూన్ 12న...