Wednesday, April 14, 2021

రాజ్యసభ హైడ్రామా- విమర్శలతో వెనక్కితగ్గిన సాయిరెడ్డి- వెంకయ్యకు క్షమాపణలు

వెంకయ్యకు విజయసాయిరెడ్డి క్షమాపణ

రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్న వెంకయ్యనాయుడిపై పరుష పదజాలంతో పాటు రాజకీయాలతో ముడిపెడుతూ చేసిన విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెనక్కి తగ్గారు. కాంగ్రెస్‌, బీజేడీ, బీజేపీతో పాటు పలు పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకావడంతో సాయిరెడ్డి వెనక్కి తగ్గక తప్పలేదు. చివరికి ఇవాళ ఉదయం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత రాజ్యసభ ఛైర్మన్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి, క్షమించాలని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యను కోరారు.

ఆవేశపూరిత వ్యాఖ్యలు వెనక్కి

ఆవేశపూరిత వ్యాఖ్యలు వెనక్కి

రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడిపై తాను చేసిన వ్యాఖ్యలు ఆవేశపూరితమే తప్ప ఉద్ధేశపూర్వకంగా చేసినవి కావని ఇవాళ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సభలో తెలిపారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని, మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని సభకు సాయిరెడ్డి తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి సభకు వెల్లడించారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కూడా వీటిని అంగీకరించారు.

నిన్న రాజ్యసభలో జరిగింది?

నిన్న రాజ్యసభలో జరిగింది?

నిన్న రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ తన ప్రసంగంలో సీఎం జగన్‌ను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న వైసీపీ ఎంపీ సాయిరెడ్డి వెంటనే ఆ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్ లేవనెత్తారు. అయితే దాన్ని రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. దీంతో సాయిరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. మీ మనసు బీజీపీతో హృదయం టీడీపీతో ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలకు దిగారు. ఇతర సభ్యులు వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. దీంతో వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం చెందారు. సాయిరెడ్డి వ్యాఖ్యలు తన మనసును బాధించాయన్నారు.

సాయిరెడ్డికి ప్రహ్లాద్‌ జోషీ మందలింపు

సాయిరెడ్డికి ప్రహ్లాద్‌ జోషీ మందలింపు

రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడిపై నిన్న సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీవ్రంగా మందలించారు. అప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ, బీజేడీ సభ్యులు సాయిరెడ్డి ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై చర్యలకు పట్టుబట్టారు. దీంతో జోక్యం చేసుకున్న ప్రహ్లాద్‌ జోషీ…సాయిరెడ్డిని ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని మందలించారు. ఛైర్మన్‌ను క్షమాపణ కోరడంతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆ తర్వాత సాయిరెడ్డి క్షమాపణలు కోరడంత పాటు వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు.


Source link

MORE Articles

రోహిత్ సేన బ్యాటింగ్ లైనప్ వీక్: బ్యాక్ అండ్ బ్యాక్ మ్యాచుల్లో 5 వికెట్లు: స్కానింగ్

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్,14వ ఎడిషన్‌లో భాగంగా చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో జరిగిన అయిదో మ్యాచ్.. ముంబై ఇండియన్స్ బౌలింగ్ సత్తాను చాటింది. కేప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలకు...

बाल झड़ने से हैं परेशान? अपनाएं ये सीक्रेट फार्मूला, फायदे हैरान कर देंगे

नई दिल्लीः बाल, शरीर का ऐसा हिस्सा है, जो इंसान की सुंदरता के लिए बेहद अहम माने जाते हैं. लेकिन आजकल बाल झड़ने...

गर्मियों में हर दिन करें एक कटोरी अंगूर का सेवन, मिलेंगे कमाल के फायदे

नई दिल्लीः गर्मियों के मौसम में सेहत का ध्यान रखना बहुत जरूरी होता है. क्योंकि इस मौसम में शरीर को विटामिन, कैल्शियम और...

Spotify’s Car Thing replaces your air vents with a smart music streaming device

Spotify has announced that its Car Thing experiment will become an official product that will ship to selected Spotify Premium customers.Car Thing, an...

Samsung Announces a Galaxy Unpacked Event on April 28 | Digital Trends

Samsung has announced its next Galaxy Unpacked event, where it will likely show off what’s next in its Galaxy product lines. This event...

Nvidia expects crippling GPU shortages to continue throughout 2021

If you’re waiting for the crippling graphics card shortage to loosen up before buying new hardware, well, you might be waiting for a...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe