PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రాత్రి భోజనం చేసిన తర్వాత.. ఈ పనులు చేస్తే ప్రశాంతంగా నిద్రపడుతుంది..!


Sleeping Tips: మన ఆరోగ్యంలో నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోతే.. మన శరీరం అలసిపోతుంది, ఆ తర్వాతి రోజు పగలంతా పరధ్యానంలో గడుపుతాం, ఏ పని సరిగ్గా చేయలేం. సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరం పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతి మనిషికి రాత్రిపూట 7 నుంచి 8 గంటల ప్రశాంతమైననిద్ర అవరసరం. నిద్ర సరిగా ఉంటేనే శరీరం విశ్రాంతి పొంది.. తిరిగి శక్తిని పుంజుకుంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజంతా టీ, కాఫీ తాగే వారు, ఆల్కహాల్‌, స్మోకింగ్‌ అలవాటున్న వ్యక్తులు, రాత్రి పూట హెవీగా తినే వ్యక్తులు హాయిగా నిద్ర పోలేకపోతున్నారు. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు చేస్తే.. ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెల్‌నెస్‌ కోచ్‌, ఆయుర్వేద డాక్టర్‌ వరలక్ష్మి.. తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో నిద్రను ప్రోత్సహించే, జీర్ణక్రియను మెరుగుపరిచే కొన్ని అలవాట్ల గురించి షేర్‌ చేశారు. రోజూ వాటిని పాటిస్తే జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమికి దూరంగా ఉండవచ్చని అన్నారు.

చేతులు శుభ్రం చేసుకోండి (పానీ ప్రక్షాళన)..

చేతులు కళ్లపై పెట్టుకోండి..

ఆయుర్వేదంలో తేజోమయ/అగ్ని మూలకమైన రాత్రి భోజనం తర్వాత చల్లని చేతులతో కళ్లను తాకాలని డాక్టర్‌ వరలక్ష్మి సూచించారు. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది. అలాగే కళ్లు రిలాక్స్‌ అయ్యేందుకు ఇది సహాయపడుతుంది.

నోరు శుభ్రం చేసుకోండి..

మనం భోజనం చేసిన తర్వాత.. ఆహారంలోని చిన్న పదార్థాలు పళ్ల సందుల్లో ఇరుక్కుంటాయి. ఇవి ఎక్కువసేపుల అలానే ఉంటే.. దంత క్షయం, హాలిటోసిస్‌కు దారితీస్తుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత బ్రష్‌ చేయాలని నిపుణులు సుచిస్తున్నారు. ఒకవేళ కుదరకపోతే.. గోరువెచ్చని నీటిలో నోరు పుక్కిలించాలని సిఫార్సు చేశారు. నోటి ఆరోగ్యం, మన పేగులతో సహా, అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి దానిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.

సోంపు తినండి..

సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన దూరం అవ్వడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సోంపు గింజలలో అనెథోల్, ఫెంచోన్‌, ఎస్ట్రాగోల్‌ ఉంటాయి. ఇవి యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు తింటే.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత సోంపు తినమని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత సోంపు నమిలితే.. జీర్ణ రసాలు బాగా ఉత్పత్తి అవుతాయి. (image source: pixabay)

కొంతసేపు నడవండి..

చాలామందికి.. భోజనం చేసిన వెంటనే పడుకోవడం, కూర్చుని టీవీ/ఫోన్‌ చూసే అలవాటు ఉంటుంది. ఇవి, అరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. రాత్రి పూట భోజనం చేసిన తర్వాత కొంతసేపు నడవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెటబాలిజం పెరగడంతో పాటు, ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ కూడా వేగవంతమవుతుంది. భోజనం తర్వాత 100 అడుగులు నెమ్మదిగా నడవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ అలవాటు నిద్రను కూడా ప్రోత్సహిస్తుంది. (image source : Pixabay)

ఎడమవైపుకు తిరిగి నిద్రపోండి..

ఎడమవైపు పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. తిన్న తర్వతా.. ఎడమవైపు తిరిగి నిద్రపోతే.. జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది.

మూడు గంటల గ్యాప్‌ ఇవ్వండి..

ఆయుర్వేదం ప్రకారం, రాత్రిపూట తేలికపాటి పోషకాహారం తీసుకోవాలి. రాత్రి నిద్రపోయే మూడు గంటల ముందు భోజనం పూర్తి చేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ గ్యాప్‌లో ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి. ఈ నియమాలు పాటించకపోతే.. మలబద్ధకం, గ్యాస్‌, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుండాలి. ఇలా చేస్తుండడం వల్ల హ్యాపీగా నిద్ర పోవచ్చు.
  • నిద్రకు ముందు కాఫీ, టీలు తాగకూడదు. ఇలా చేయడం వల్ల నిద్రభంగం కలగొచ్చు.
  • నిద్రపోయే ముందు ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేసుకోండి.
  • కొంతమంది నిద్రపట్టడం లేదని ఆల్కహాల్ తీసుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల అన్ని మరిచిపోయి నిద్రపోవచ్చని భావిస్తారు. కానీ, ఇలా చేయడం వల్ల సమస్య ఎక్కువ అవుతుందని తగ్గదు.
  • నిద్రపోయే ముందు ముఖ్యంగా త్వరగా జీర్ణం కానీ ఆహార పదార్థాలను తీసుకోకూడదు. దీనివల్ల జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి. జీర్ణ సమస్యలు వస్తే రాత్రి మేల్కోవాల్సి వస్తుంది.
  • పగటిపూట ఎక్కువసేపు నిద్రపోవద్దు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.(Image source: pixabay)



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *