Citroen New Electric Car: భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అద్భుతమైన వృద్ధి కనిపిస్తోంది. దీని కారణంగా ఒకదాని తర్వాత మరొకటిగా కార్ల తయారీదారీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ కూడా తన ఎలక్ట్రిక్ కారు సిట్రోయెన్ ఈసీ3ని భారత దేశ మార్కెట్లో విడుదల చేసింది. ఇది రెండు ట్రిమ్‌లలో లాంచ్ అయింది. దేశీయ మార్చెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగోతో పోటీపడనుంది.

ధర ఎంత
కంపెనీ సిట్రోయెన్ ఈసీ3 కారును రూ.11.50 నుంచి రూ.12.43 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరతో మార్కెట్లో పరిచయం చేసింది. దాని పోటీదారు టాటా టియాగో ఎలక్ట్రిక్ కంటే సిట్రోయెన్ ఈసీ3 కారు ధర రూ. 1.31 లక్షలు ఎక్కువ కావడం విశేషం.

ఈ కారు రేంజ్, ఛార్జింగ్
Citroën EC3 కారులో, కంపెనీ 29.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. అలాగే ఇది 320 కిలో మీటర్ల రేంజ్‌ను అందించనుందని కంపెనీ ప్రకటించింది.. ఈ ఎలక్ట్రిక్ కారులో ఒకే ఎలక్ట్రిక్ మోటార్ అందించారు. ఇది కారు ముందు చక్రానికి గరిష్టంగా 57 PS పవర్, 143NM గరిష్ట టార్క్ ఇస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ గంటకు 107 కిలో మీటర్లుగా ఉంది. ఇది కాకుండా ఛార్జింగ్ చేయడానికి రెండు ఛార్జింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి 15A ఛార్జింగ్ సాకెట్ ద్వారా ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి 10 గంటల 30 నిమిషాలు పడుతుంది. రెండోది డీసీ ఫాస్ట్ ఛార్జర్. దీని ద్వారా ఈ కారు కేవలం 57 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వగలదు.

ఇంటీరీయర్ ఫీచర్లు
Citroen EC3 కారులో అందించిన ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో మాన్యువల్ AC ఉండనుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, కీలెస్ ఎంట్రీ, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, పవర్ విండోస్, ఆండ్రాయిడ్ ఆటో, Apple CarPlay ద్వారా కనెక్ట్ అయిన కార్ టెక్నాలజీ, 10 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ వంటి ఫీచర్లను అందించారు.

వారంటీ కవరేజ్
సిట్రోయెన్ ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీపై ఏడేళ్లు లేదా 1.4 లక్షల కిలో మీటర్ల వరకు వారంటీని ఇస్తోంది. ఇది దాని పోటీదారు టాటా టియాగో ఎలక్ట్రిక్ కంటే తక్కువ. టాటా టియాగో ఎలక్ట్రిక్‌పై కంపెనీ ఎనిమిది సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలో మీటర్ల వరకు వారంటీని అందిస్తుంది.

సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారు. దీనికి ముందు సాధారణ సిట్రోయెన్ సీ3 కూడా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర మనదేశంలో రూ.5,70,500 (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం కానుంది. ఇది లైవ్ ట్రిమ్ లెవల్ ధర. ఇక హైఎండ్ అయిన ఫీల్ ట్రిమ్ వేరియంట్ ధర రూ.8,05,000గా ఉంది. డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ కూడా ఇందులో ఉండనుంది.

ఇందులో ఏకంగా 56 కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి. అలాగే 70కి పైగా యాక్సెసరీలు కూడా తీసుకోవచ్చు. వైబ్, ఎలిగెన్స్, ఎనర్జీ, కన్వీనియన్స్ అనే అదనపు ప్యాకేజీ ఆప్షన్లు కూడా ఈ కారుతో అందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *