Monday, May 23, 2022

రూ.30,000 లోపు లభించే టాప్-4 ప్రీమయం సైకిల్స్

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. వివిధ రకాల బడ్జెట్‌లకు అనుగుణంగా, వివిధ రకాల సైకిళ్లు లభిస్తున్నాయి. ఈ కథనంలో రూ.30,000 లోపు లభించే టాప్-4 ప్రీమియం సైకిళ్ల గురించి తెలుసుకుందాం రండి.

రూ.30,000 లోపు లభించే టాప్-4 ప్రీమయం సైకిల్స్

ఫైర్‌ఫాక్స్ టోర్నడో 27.5డి

రకం: ట్రెక్కింగ్ కోసం బైక్ ధర: రూ. 25,000

ప్రీమియం సైకిల్ బ్రాండ్ ఫైర్‌ఫాక్స్ అందిస్తున్న మౌంటైన్ బైక్ టోర్నడో 27.5డి రూ.25,900 ధరతో లభిస్తుంది. సైకిల్‌పై అడ్వెంచర్ ప్రయాణాలు చేసే వారికి ఇదొక చక్కటి ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇందులో షిమానో బ్రాండ్ నుండి గ్రహించిన 8-స్పీడ్ గేర్‌బాక్స్ సిస్టమ్ ఉంటుంది. దీనిని లైట్ వెయిట్ అల్లాయ్ ఫ్రేమ్‌తో డిజైన్ చేశారు.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

రూ.30,000 లోపు లభించే టాప్-4 ప్రీమయం సైకిల్స్

కేవలం సిటీ ప్రయాణాలకే కాకుండా రహదారులు లేని ఆఫ్-రోడ్ ట్రాక్స్‌పై సైతం నడిపేందుకు వీలుగా ఉంటుంది. ఈ సైకిల్‌లో బెటర్ రైడింగ్ పొజిషన్ కోసం అడ్జస్టబల్ సీట్, కంఫర్ట్ కోసం ఫ్రంట్ హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టమ్ లభిస్తుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ఇందులో ముందు వైపు డిస్క్ బ్రేక్ ఉంటుంది.

రూ.30,000 లోపు లభించే టాప్-4 ప్రీమయం సైకిల్స్

బిట్విన్ రాక్‌రైడర్ 520 ఎమ్‌టిబి

బిట్వన్ రాక్‌రైడర్ 520 ఎమ్‌టిబి కూడా డ్యూయెల్ పర్పస్ సైకిల్. ఇది ఇటు సిటీ ప్రయాణాలకు అటు ఆఫ్-రోడ్ అడ్వెంచర్ రైడ్స్‌కి అనుకూలంగా ఉంటుంది. మార్కెట్లో దీని ధర రూ.23,999గా ఉంది. దీని ఫ్రేమ్‌ని ధృడమైన సిజిఎఫ్ ఎవో అల్యూమినియంతో తయారు చేశారు.

MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్‌లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

రూ.30,000 లోపు లభించే టాప్-4 ప్రీమయం సైకిల్స్

ఇందులో 24-స్పీడ్ గేర్ సిస్టమ్ ఉంటుంది. ఇరువైపులా 27.5 ఇంచ్ ఏరో ట్రైల్ ఎవో వీల్స్‌ను ఉపయోగించారు. బెటర్ బ్రేకింగ్ కోసం ఈ సైకిల్‌లో రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇందులోని టైర్లను మరియు ఫోర్క్‌ను రైడర్ బరువుకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవచ్చు.

రూ.30,000 లోపు లభించే టాప్-4 ప్రీమయం సైకిల్స్

ఫైర్‌ఫాక్స్ రోడ్ రన్నర్ ప్రో డి ప్లస్

ఫైర్‌ఫాక్స్ రోడ్ రన్నర్ ప్రో టి ప్లస్ టీనేజర్లకు మంచి అనుకూలమైన హైబ్రిడ్ సైకిల్. మార్కెట్లో దీని ధర రూ.29,500గా ఉంది. ఈ సైకిల్ సిటీ రైడ్స్‌కి మరియు దూర ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఇందులో మెరుగైన సస్పెన్షన్ కోసం ముందు భాగంలో 40 ఎంఎం సస్పెన్షన్‌ను అమర్చారు.

రైడర్ హైట్‌ను బట్టి ఈ సైకిల్ 4 వేర్వేరు ఫ్రేమ్ సైజులలో లభిస్తుంది. ఇందులో సౌకర్యవంతమైన సీట్ మరియు బెటర్ గ్రిప్స్‌తో కూడిన హ్యాండిల్ బార్ ఉంటాయి. ఇరు వైపులా డిస్క్ బ్రేక్స్, షిమానో 7-స్పీడ్ గేర్ యూనిట్, అల్లాయ్ డబుల్ వాల్ 36హెచ్ రిమ్స్, వాండా 700×35సి టైర్స్, అల్లాయ్ హైబ్రిడ్ ఫ్రేమ్ దీని ప్రత్యేకతలు.

MOST READ:ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

రూ.30,000 లోపు లభించే టాప్-4 ప్రీమయం సైకిల్స్

మోంట్రా ట్రాన్స్ 700×35సి

మోంట్రా ట్రాన్స్ 700×35సి ఒక 21-స్పీడ్ స్టైలిష్ స్పోర్టీ అల్లాయ్ సైకిల్. మార్కెట్లో దీని ధర రూ.18,350గా ఉంది. ఇది కూడా ఓ హైబ్రిడ్ బైక్. ఫస్ట్ టైమ్ ప్రీమియం సైకిళ్లను ట్రై చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. దీని ఫ్రేమ్‌ను తేలికపాటి అల్యూమినియం అల్లాయ్‌తో తయారు చేశారు.

రూ.30,000 లోపు లభించే టాప్-4 ప్రీమయం సైకిల్స్

ఈ సైకిల్‌లో అడ్జస్టబల్ సీట్ ఉంటుంది. ముందు వైపు 50 ఎంఎం హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది. కాకపోతే, ఇందులో డిస్క్ బ్రేక్స్ ఉండవు, వాటి స్థానంలో వి ఆకారాపు మెకానికల్ బ్రేక్స్ ఉంటాయి. ఈ సైకిల్‌ను అన్ని రకాల రోడ్లపై ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది.

MOST READ:ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..
Source link

MORE Articles

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సిద్ధం.. ముహూర్తం?

ys jagan మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై వైకాపా...

జానపద నృత్యానికి స్టెప్పులేసిన సిద్ధరామయ్య! (video)

siddaramaiah కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య...

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదు

earthquake అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం...

కేంద్రం వైఖరిపై తెలంగాణ మంత్రుల మండిపాటు

తెలంగాణ ప్రజలకు కేంద్రం అధికారంలో...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe